హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ క్లీన్‌స్విప్
పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ విజయఢంకా
దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో కొన్ని చోట్ల బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ చేయగా, పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి గట్టిగా పట్టున్న దిన్‌హటా నియోజకవర్గం మమతా వశమైంది. కర్ణాటకలోనూ మిశ్రమ పలితాలొచ్చాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన లోక్‌సభతోపాటు పలు అసెంబ్లీ సీట్లను కోల్పోయింది. మండి లోక్‌సభ స్థానంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అక్టోబర్ 30న మండి పార్లమెంట్ స్థానంతోపాటు ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ కోట్‌ఖాయ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయింది.మండి పార్లమెంటరీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ భార్య, కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్.. బీజేపీ అభ్యర్థి బ్రిగేడియర్ కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలుపొందింది. ఫతేపూర్ నుంచి భవానీ సింగ్, ఆర్కీ నుంచి సంజయ్, జుబ్బల్ నుంచి రోహిత్ ఠాకూర్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు వేడుకలు నిర్వహించుకుంటున్నారు.
కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. సిండ్గీ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించగా, హంగల్‌లో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకెళుతోంది.
అసోంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు వెలువడుతున్న ఉపఎన్నికల ఫలితాల్లో ఒకచోట బీజేపీ విజయం సాధించింది. మరో నాలుగు చోట్ల ఎన్‌డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్‌లో ఖంద్వా లోక్‌సభ నియోజకవర్గంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరో శాసనసభ స్థానంలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రనగర్ హవేలీ లోక్‌సభ స్థానంలో శివసేన విజయం సాధించింది.
పశ్చిమబెంగాల్‌లో నాలుగు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగ్గా..నాలుగుచోట్ల అధికార తృణమూల్ విజయం ఢంకా మోగించింది. దిన్‌హటాలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహ..బీజేపీ అభ్యర్థి అశోక్ మండల్‌పై 1.40 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గోసాబాలో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా మండల్ 1.41 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. శాంతిపూర్, ఖర్దాప్‌ాల్లోనూ టీఎంసీ ఘనవిజయాన్ని సాధించింది.