మూడు స్థానాల్లో పోటీకి సీపీఐ నిర్ణయం
ఫరూక్ అబ్దుల్లాతో అజీజ్ పాషా, అనీ రాజా భేటీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్‌కాంగ్రెస్ కూటమికి సీపీఐ జమ్మూకశ్మీర్ శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్ ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అనీ రాజా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ఆయన నివాసంలో కలిశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిం చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ఇండియా ఐక్యసంఘటన భాగస్వామ్య పార్టీగా కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీ
కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు కశ్మీర్ సీపీఐ శాఖ సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. అయితే మూడు స్థానాల్లో సీపీఐ పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏకాభిప్రాయం కోసం ఇండియా ఐక్యసంఘటన పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడిరచారు. ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ… సీపీఎం, సీపీఐ రెండు కళ్లలాంటివని, ముఖ్యంగా కశ్మీర్ విష యంలో అన్ని విషయాల్లో ఎప్పుడూ సూత్రబద్ధ వైఖరి అవలంబిస్తు న్నాయని అన్నారు. చర్చల సందర్భంగా కశ్మీరులోశ్రీనని షోపియాన్‌లో పోటీచేసే యోచనను సీపీఐ నేతలు వ్యక్తపర్చగా… జమ్మూ ప్రాంతంలో ఒకటి లేదా రెండు స్థానాల్లో స్నేహపూర్వకంగా పోటీ చేస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. జమ్మూలో సీపీఐ పోటీ చేయాలనుకున్న మూడు స్థానాలు బీజేపీ ఓట్లను మాత్రమే చీలుస్తాయని సీపీఐ ప్రతినిధి బృందం అబ్దుల్లాకు వివరించింది. అయితే ఫరూక్ అబ్దుల్లా జమ్మూలో కేవలం ఒక సీటు మాత్రమే సూచించి నట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో రాజకీయ దృశ్యం మారిన నేపథ్యంలో పదేళ్ల విరామం తర్వాత ఎన్నికలు చాలా కీలకమని సీపీఐ భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఓటర్లను మతపరంగా విడగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. కశ్మీర్ లోయలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని… అదే సమయంలో జమ్మూలోని చెనాని, దోడ్డా, నిర్గోటా అనే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్లు అజీజ్‌పాషా, అనీ రాజా తెలిపారు. అయితే ఈ స్థానాల్లో ఏకాభిప్రాయం సాధించడానికి ఇండియా ఐక్యసంఘటన భాగస్వామ్య పక్షాలతో చర్చలు సాగిస్తున్నట్లు తెలిపారు.