అఖిలేష్ యాదవ్ ధీమా
రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎస్పీకి 400 స్ధానాలు కట్టబెడతారని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.కాన్పూర్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, యూపీలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే అధికార మార్పిడి జరగడం ఖాయమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని లఖింపూర్ ఖేరి ఘటనను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.బీజేపీ కార్యకర్తలు తమ వాహనాలతో రైతులను తొక్కించి చంపేస్తున్నారని ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని పేర్కొన్నారు. యూపీలో నిరుద్యోగం, ఎరువుల ధరలను పెంచి రైతులను పీడిస్తున్న నకిలీ బాబా పతనం తప్పదని యోగిని ఉద్దేశించి అఖిలేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.