Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

కాస్త తగ్గిన కరోనా కేసులు

10.5లక్షల మందికి పైగా ప్రికాషనరీ డోసు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. లక్ష పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే నిన్న రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్గుదల కన్పించింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,68,063 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 277 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,21,446కు చేరుకుంది. రోజువారీ కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా నమోదైంది. దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. నిన్న 428 మందిలో దీనిని గుర్తించారు. దాంతో మొత్తం కేసులు 4,461కి చేరాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,247 మంది వేరియంట్‌ బారినపడగా, రాజస్థాన్‌, దిల్లీలో ఆ సంఖ్య 645, 546గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 92,07,700 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 152 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. అలాగే నిన్నటి నుంచి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రికాషనరీ డోసు ఇస్తున్నారు. నిన్న 10.5లక్షల మంది ప్రికాషనరీ డోసును తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img