Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

కేంద్ర మంత్రుల్లో 33 మంది క్రిమినల్స్‌

24 మందిపై హత్య, దోపిడీ కేసులు
90 శాతం కోటీశ్వరులు ఏడీఆర్‌ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ :
కేంద్రంలో మోదీ సర్కార్‌ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణతో మొత్తం మంత్రుల సంఖ్య 78కు పెరిగి ంది. వీరిలో 36 మంది కొత్త వారు ఉన్నారు. 81 మంది వరకు కేబినెట్‌లో ఉండేందుకు అనుమతివుంది. కొత్త కేబినెట్‌లో 42శాతం అంటే 33 మంది నేరచరితులు ఉన్నారు. వీరిలో 24 మందిపై హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడిరచింది. ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. కొత్త కేబినెట్‌లో 90శాతం అంటే 70 మంది కోటీ శ్వరులు ఉన్నారని (కోటికిపైగా ఆస్తికలిగి వున్న వారు) తెలిపింది. అయితే వీరిలో నలు గురు అత్యంత సంపన్నులుగా ఉన్నారు. జ్యోతి రాదిత్య సింధియా (రూ.379కోట్లకుపైగా), పీయూష్‌ గోయల్‌ (రూ.95కోట్లు), నారాయణ్‌ రాణె(రూ.87కోట్లు), రాజీవ్‌ చంద్రశేఖర్‌ (రూ.64కోట్లు) అత్యంత సంపన్న మంత్రుల జాబి తాలో ఉన్నారు. అంటే వారు రూ.50కోట్లకుపైగా ఆస్తులను ప్రకటించారు. కేబినెట్‌ విస్తరణ అనంతరం తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించిన మంత్రుల సంఖ్య మూడు శాతం మేర పెరిగిందని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. 2019లో తొలి కేబినెట్‌ ఏర్పాటు అయినప్పుడు 39శాతం అంటే 56 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉండగా, 91శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. కేంద్రంలో మొత్తం మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ. 16. 24కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. త్రిపురకు చెందిన ప్రతిమా భౌమిక్‌ (సుమారు రూ.6లక్షలు), పశ్చిమ బెంగాల్‌కు చెందిన జార్‌ బార్లా (సుమారు రూ.14లక్షలు), రాజస్థా న్‌కు చెందిన కైలాశ్‌ చౌదరీ (సుమారు రూ. 24లక్షలు), ఒడిశాకు చెందిన బిశ్వేశ్వర్‌ తుడు (సుమారు రూ. 27లక్షలు), మహారాష్ట్రకు చెందిన వి.మురళీ ధరన్‌ (సుమారు రూ. 27లక్షలు) మంత్రుల్లో తక్కువ ఆస్తిపరులుగా ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. కొత్త మంత్రుల్లో 21 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు కాగా తొమ్మిది మంది డాక్టరేట్‌ అందుకున్న వారు ఉన్నారు. 17 మంది గ్రాడ్యు యేట్లు, మరో 17 మంది ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయే షన్‌ పూర్తిచేసిన వారున్నారు. ఏడుగురు ఇంటర్‌, ముగ్గురు టెన్త్‌, ఇద్దరు 8వ తరగతి చదివిన వారు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img