ఉత్తరాఖండ్‌లో పవిత్ర ఛార్‌ధామ్ యాత్రల్లో ఒకటైన కేదారనాథ్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం సందర్శించారు.అక్కడ కేదారీశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిగురువు ఆదిశంకరాచార్య 12 అడుగుల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. . బాబా కేదార్ ఆలయం వెనుక భాగంలో శంకరాచార్య సమాధి ఉన్న విషయం తెలిసిందే. ఆ సమాధి పునరుద్దరణ పనులను స్వయంగా మోదీ సమీక్షిస్తున్నారు. 2019 నుంచి శంకరాచార్య విగ్రహ పునర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆదిశంకరాచార్య విగ్రహం సుమారు 35 టన్నుల బరువుతో నిర్మించారు. ఇవాళ ఉదయం డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కేదార్‌నాథ్ చేరుకున్న మోదీ అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.