Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

కొల్లేరు పదిలమేనా?

దర్జాగా సరస్సు అభయారణ్యం కబ్జా
. ఎమ్మెల్యేల కనుసన్నల్లో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు
. లంక గ్రామాలు వరద ముంపునకు కారణం అవే!
. పట్టించుకోని అధికార యంత్రాంగం

విశాలాంధ్ర ప్రతినిధి – ఏలూరు : కొల్లేరు సరస్సు పదిలమేనా? తాజాగా బుడమేరు వాగు విజయవాడ నగరాన్ని ముంచేసిన తర్వాత తలెత్తిన మరో సందేహం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచిన కొల్లేరు ఉనికి రానురాను ప్రశ్నార్ధకంగా మారుతోంది. సరస్సులో సహజ సిద్ధంగా మాత్రమే చేపల వేట కొనసాగించాల్సి ఉండగా అభయారణ్యం పరిధిలో భారీ ఎత్తు గేట్లు వేసి నిబంధనలకు విరుద్ధంగా వేలాది ఎకరాల్లో చేపల చెరువులను అక్రమంగా తవ్వారు. దీంతో వరదల సమయంలో నీటిపారుదల సక్రమంగా జరగకుండా కొల్లేరు సరస్సును ముంచెత్తి చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రతి ఏడాది వేసవిలో వందలాది ఎకరాలు ఎమ్మెల్యేల కనుసన్నల్లో దర్జాగా తవ్వుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. దీంతో కొల్లేరు అభయారణ్యం పరిధిలో వేలాది ఎకరాలు అక్రమార్కుల కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా కొల్లేరును ఆవరించి ఉన్న దెందులూరు, భీమడోలు, ఏలూరు రూరల్‌, మండవల్లి, కైకలూరు, ఆకివీడు మండలాల్లో అక్రమ చేపల చెరువులు తవ్వకాలకు అంతేలేకుండా పోయింది. గత ఏడాది కూడా దెందులూరు, భీమడోలు, మండవల్లి, కైకలూరు, ఉంగుటూరు మండలాల పరిధిలో వందల ఎకరాల్లో చేపలు చెరువులు ఎమ్మెల్యేల కనుసన్నల్లో తవ్వారని ప్రచారం జోరుగానే సాగినప్పటికీ దీనిపై స్పందించాల్సిన జిల్లా అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు మౌనం దాల్చడంతో అక్రమ చేపల చెరువులను అడ్డుకోవడం అసాధ్యంగా మారింది. ఇందుకు ప్రధానంగా రాజకీయ ఒత్తిడి ఒక కారణమైతే, ఈ తవ్వకాల్లో అధికారులకు అందాల్సిన ముడుపులు ముందుగానే అందిస్తూ స్థానిక నాయకులకు, రాజకీయ పార్టీల నేతలకు ఎవరి వాటాలు వారికి అందజేస్తుండటంతో ఎవరికి వారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. వాస్తవానికి కొల్లేరు సరస్సులోకి గుండేరు, రామిలేరు, తమ్మిలేరు, రాళ్లవాగు తదితర వాగుల ద్వారా వచ్చే వరద నీరు ఉప్పుటేరు మార్గం ద్వారా సముద్రంలో కలుస్తుంది. బుడమేరు వాగు ద్వారా వచ్చే వరద నీరు పెదపాడు మండలం గుడిపాడు గ్రామం వద్ద ఉన్న రామిలేరు వాగు మీదుగా ఏలూరు జిల్లాలో ప్రవేశించి పెదఎడ్లగాడి గ్రామం వద్ద కొల్లేరు సరస్సులో కలుస్తుంది. అదేవిధంగా తమ్మిలేరు వాగు ద్వారా వచ్చే వరద నీరు ఏలూరు కాలువ మీదుగా కోమటిలంక గ్రామం నుంచి కొల్లేరు సరస్సులో కలిసి పెదఎడ్లగాడి మీదుగా ఉప్పుటేరులోకి చేరి సముద్రంలో కలుస్తుంది. ఈ విధంగా కొల్లేరు సరస్సులోకి చేరే వరద నీటి ప్రవాహం సజావుగా సాగాలంటే ఎటువంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో 1999 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలోని ఐదో కాంటూరు పరిధి వరకు అభయారణ్యంగా ప్రకటిస్తూ 120 జీవోను అమలు చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు రూరల్‌, దెందులూరు, పెదపాడు, నిడమర్రు, ఉంగుటూరు, కైకలూరు, ఆకివీడు, భీమడోలు, మండవల్లి మండలాల పరిధిలోని 77 వేల ఎకరాలను అభయారణ్యం (5వ కాంటూరులోపు) పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ జీఓ ప్రకారం సరస్సులో ఎవరూ కూడా మోటారు బోట్ల ద్వారా చేపలు పట్టడం, కొల్లేరు అభయారణ్యం పరిధిలో చెరువులు తవ్వడం, పక్షులను వేటాడడం వంటివి చేయకూడదు. అయితే కొందరు బడా బాబులు రాజకీయ నేతల అండదండలతో సరస్సులో అక్రమ చేపల చెరువులు తవ్వడంతో ప్రభుత్వ అనుమతితో 2006-07వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ కొల్లేరు ప్రక్షాళనకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే సుమారు 13 వేల ఎకరాల అక్రమ చేపల చెరువులను గుర్తించి ధ్వంసం చేసి కొల్లేరు సరస్సుకు సహజరూపు తీసుకువచ్చారు. ఆ సమయంలోనే కొల్లేరు అభయారణ్యం చట్టం పటిష్టంగా అమలు చేయాలని 5వ కాంటూరులోపు ఉన్న కొల్లేరు సరస్సుకు సరిహద్దులు నిర్ధారించారు అంతేకాకుండా కొల్లేరు అభయారణ్యంగా ప్రకటించిన ఐదవ కాంటూరు లోపు ఎటువంటి చేపలు చెరువులు తవ్వకూడదని, కొల్లేరు లంక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు సహజ సిద్ధమైన చేపల వేట కొనసాగించి జీవనం సాగించవచ్చని, వీటిని ఉల్లంఘిస్తే అభయారణ్యం చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయితే కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న అక్రమార్కులు తిరిగి తమకున్న రాజకీయ పలుకుబడితో అభయారణ్యం పరిధిలో ఉన్న ఐదవ కాంటూరులో వందలాది ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు తవ్వకాలు ప్రారంభించారు. దీంతో తిరిగి కొల్లేరు కబ్జాకు గురవుతూ వచ్చింది. ఈ విధంగా ఇప్పటివరకు కొల్లేరు అభయారణ్యం పరిధిలో 9,500 వేల ఎకరాల్లో తిరిగి అక్రమ చేపల చెరువులు తవ్వారని కొంతకాలం క్రితం జిల్లా అటవీ శాఖ అధికారులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఇచ్చిన నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విధంగా చూస్తే గత దశాబ్ద కాలంలో అక్రమ చేపల చెరువులు కాంటూరు పరిధిలో ఏ స్థాయిలో వెలిశాయనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కొల్లేరు సరస్సుపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం దృష్టి సారించి అక్రమ చేపల చెరువులను నిరోధించి కబ్జా కోరల్లో చిక్కుకున్న సరస్సును సంరక్షించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది సహజ వనరులైన కొల్లేరును భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img