ఏపీ, బీహార్ ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్
ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు సమన్లు
కొవిడ్ పరిహార చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.ఏపీ, బీహార్ రాష్ట్రాలపై అత్యున్నత న్యాయస్థానం అసహనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కరోనా కారణంగా మరణించినవారి కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపుల విషయంలో ఏపీ, బీహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.