Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

త్వరలో జన్మభూమి-2

. తొలిదశలో ముఖ్యనేతలకు నామినేటెడ్‌ పదవులు
. టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన జన్మభూమి కార్యక్రమాన్ని మరలా అమలు చేయాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘జన్మభూమి-2’ పేరుతో త్వరలోనే మరలా ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని, తెలంగాణలో కూడా పార్టీ బలోపేతానికి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరగింది. జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ముఖ్యనేతలకు మొదటి దశలో నామినేటెడ్‌ పదవుల భర్తీ చేపట్టాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. రెండున్నర గంటలపాటు వివిధ అంశాలపై చంద్రబాబు పార్టీ నేతలకు మార్గనిర్దేశనం చేశారు. అనంతరం సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి తగ్గుతుంది. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం తగ్గుతాయని, అందువల్ల సంతాన ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు వెల్లడిరచారు. జనాభా నియంత్రణతో డీలిమిటేషన్‌లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోంది. యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారతదేశంలో మొత్తం 160 మాత్రమే ఉంటాయి. దీనిలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా సంతాన పరిమితిని ఎత్తివేస్తూ త్వరలో అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నట్లు చెప్పారు. త్వరలో పేదరిక నిర్మూలనపై విధివిధానాలు రూపొందించాలని, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని దీనిలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని నిశ్చయించినట్టు చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే దానిపై కూడా మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించినట్లు తెలిపారు. నారా లోకేశ్‌, కొల్లు రవీంద్ర, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కాలువ శ్రీనివాసులు, బొండా ఉమామహేశ్వర రావు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img