కరోనా బారి నుంచి పిల్లలను రక్షించేలా త్వరలో కొవిడ్ టీకా వస్తోంది. 2-18 ఏళ్లలోపు పిల్లలకు కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్‌లో చిన్నారులపై కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయిల్స్ పూర్తవ్వగా.. వాటి సంబంధించిన ఫలితాలను వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ పరిశీలించింది.18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ టీకాను వినియోగించేందుకు ఎక్స్‌పర్ట్ ప్యానల్ సిఫారసు చేసింది.దీంతో కేంద్రం అనుమతి పొందిన తొలి దేశీయ టీకాగా కోవాగ్జిన్ నిలిచింది. కాగా 2`18 ఏళ్ల వారి కోసం కోవాగ్జిన్ టీకా 2,3 దశల ప్రయోగాలను 525 మంది చిన్నారులపై గత నెలలో పూర్తి చేసిన బయోటెక్ ఆ నివేదికను డీసీజీఐకు అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన డీసీజీఐ నిపుణుల కమిటీ పిల్లలకు కోవాగ్జిన్ టీకా ఇచ్చేలా అత్యవసర అనుమతులు జారీ చేయాలని సిఫార్సులు చేసింది.