దేశంలోకరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గురువారం 13,091 కేసులు నమోదవగా తాజాగా అవి 12 వేల దిగువకు చేరాయి. ఇది నిన్నటికంటే 4.3 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దేశంలో గడచిన 24 గంటల్లో 12,516 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,14,186కు చేరాయి. ఇందులో 3,38,14,080 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,37,416 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,62,690 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,37,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 267 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.26 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 1.07శాతం ఉంది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 110.79 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.