దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొద్దికాలంగా మూడు లక్షలలోపు నమోదవుతోన్న కేసులు తాజాగా రెండు లక్షలకు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,09,918 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్ బారిన పడి 959 మంది మృతి చెందారు. అలాగే 2,62,628 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 18,31,268 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రోజువారీ కోవిడ్ పాజిటివీటి రేటు 15.77 శాతంగా నమోదు అయ్యింది. దేశ వ్యాప్తంగా 1,66,03,96,227 మంది టీకా తీసుకున్నారు.