Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

నాపై ఈడీ దాడులు

. అదే జరిగితే చాయ్‌, బిస్కెట్లతో ఆహ్వానిస్తా
. ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ

న్యూదిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ సర్కారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ను తనపై ప్రయోగించబోతోందన్నారు. ఈ మేరకు ఈడీ సోదాలకు సిద్ధమవుతోందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆ సంస్థలో పనిచేసే కొందరు విశ్వసనీయ వ్యక్తుల నుంచి తనకు ఈ సమాచారం అందిందని వెల్లడిరచారు. దీనికి కారణం లోక్‌సభలో తన చక్రవ్యూప్‌ా ప్రసంగమేనని ఆయన చెప్పారు. ఈ మేరకు తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘నాపై ఈడీ దాడులు జరగొచ్చు. ఓ అధికారి నుంచి నాకు దానిపై సమాచారం వచ్చింది. జులై 29న నేను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్‌ కొందరికి నచ్చలేదు. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా… అదీ ఛాయ్‌ బిస్కెట్లతో ’’ అని పేర్కొన్నారు. కాగా రాజకీయ వేధింపుల కోసం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని మోదీ సర్కారు దుర్వినియోగం చేయడంపై వాయిదా తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ శుక్రవారం నోటీసు సమర్పించారు. కేంద్ర బడ్జెట్‌ 2024-25పై లోక్‌సభలో చర్చ సందర్భంగా సోమవారం ప్రసంగించిన రాహుల్‌ గాంధీ ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని చక్రవ్యూహం (పద్మ వ్యూహం) లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా, మరికొందరిపై రాహుల్‌ గాంధీ విమర్శలు సంధించారు. అభిమన్యుడిని పద్మవ్యూహంతో ఆరుగురు ఎలా హత్య చేశారో, ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ, దేశంలోని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహాన్ని పన్నుతున్నారని రాహుల్‌ ఆరోపించారు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశమని రాహుల్‌ గాంధీ విమర్శించారు. దేశాన్ని బంధించిన చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయన్నారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని అన్నారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్‌ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇండియా ఐక్య సంఘటన పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధమైన హామీతో పాటు కుల గణనను సభ ఆమోదించేలా చూస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img