ఇదేనా అనుమతివ్వడమంటే…?
మోదీయోగి సర్కార్‌లపై రాహుల్ ఆగ్రహం లక్నో ఎయిర్‌పోర్టులో నిర్బంధం
ధర్నా
కాంగ్రెస్ నేతలతో కలిసి సొంత వాహనంలోనే లఖింపూర్‌కు …
లక్నో / న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ హింస బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని లక్నో విమానాశ్రయంలో అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఆపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ వాహనం లోనే వెళ్లాలని పోలీసులు షరతు పెట్టగా సొంత వాహనంలోనే వెళతానని రాహుల్ పట్టుబట్టారు. విమానాశ్రాయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో దిగి వచ్చిన పోలీసులు ఆయనకు అనుమతిచ్చారు. అంతకుముందు రాహుల్ విలేకరులతో మాటా ్లడారు. తన కోసం వాహనం ఏర్పాటు చేయడానికి వీరు ఎవరని ప్రశ్నించారు. ఏ నిబంధనల ప్రకారం తన ప్రయాణాన్ని నిర్ణయి స్తారని నిలదీశారు. తనను విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లనివ్వ కుండా అడ్డుకోవడాన్ని తప్పు పట్టారు. తొలుత సొంత వాహనాల్లో వెళ్లేందుకు అనుమతి ఇచ్చి ఇప్పుడు పోలీసు వాహనాల్లోనే వెళ్లమనడం వెనుక ఏదో ఉందని వ్యాఖ్యానించారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీ సులు ఆయనకు సొంత వాహనంలోనే వెళ్లేందుకు అనుమతిచ్చారు. రాహుల్ వెంట చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్, పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జే వాలా ఉన్నారు. తననుగానీ ప్రియాంకనుగానీ జైలుకు పంపడం ముఖ్యం కాదని ప్రజలను నేరగాళ్లు అణచివేస్తుం డటం ప్రధాన అంశమని లఖింపూర్ ఘటననుద్దేశించి రాహుల్ అన్నారు. జైళ్లలో పెట్టాల్సిన వారిని స్వేచ్ఛగా వదిలేసి.. బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించేం దుకు వెళ్లేవారిని అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చౌదరి చరణ్ సింగ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్ల కుండా సీఆర్పీఎఫ్ బృందం తనను అడ్డుకున్నట్లు తెలి పారు. ‘మీరే చూడండి.. ఇది! వాళ్లు ఇచ్చిన అనుమతి!’ అంటూ రాహుల్ తమను చుట్టుముట్టి మానవహారంగా ఏర్పడిన బలగాలను మీడియాకు చూపుతూ అన్నారు. నేను వాళ్లను ఒకటే అడుగుతున్నా. దేశ పౌరునిగా ఉత్తరప్రదేశ్‌కు వచ్చా. లఖింపూర్ ఖేరికి వెళ్లాలనుకుం టున్నా. ఎందుకని అనుమతించడం లేదు? దీని వెనుక హానికరమైనది ఏదో లేకుండా ఉండదు’ అని అన్నారు. అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి లభించడంతో రాహుల్ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రియాంకను కలిసేందుకు సీతాపూర్‌కు వెళ్లారు. ఆమె సోమవారం ఉదయం నుంచి అక్కడ నిర్బంధంలో ఉన్నారు. సోదరితో కలిసి రాహుల్ తన బృందంతో పాటు లఖింపూర్ ఖేరికి చేరుకొని బాధితులను పరామర్శించారు.
ఇదిలావుంటే, రాహుల్ న్యూదిల్లీలో విలేకరులతో సమావేశమై మోదీ ప్రభుత్వంతో పాటు యోగి సర్కార్ తీరును దుయ్యబట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు నిరంకుశత్వానిదే రాజ్యమని వ్యాఖ్యానించారు. రైతులపై వ్యవస్థాగత దాడులు జరుగుతున్నాయన్నారు.మంగళవారం లక్నోలోనే ఉన్న ప్రధాని.. లఖింపూర్ ఖేరికి వెళ్లి బాధితులను పరామర్శించలేకపోయారని ఎద్దేవా చేశారు. కొంత కాలంగా రైతులపై ప్రభుత్వం దాడులు చేస్తోందని, వారిని చక్రాల కింద నలిపేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీ హోంమంత్రి, ఆయన తనయుడి పేర్లు బయటకు వచ్చినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాహుల్ అన్నారు. కొత్త కొత్త కథనాలు వినవస్తున్నాయి.. ఇవి ఆక్షేపణీయమన్నారు. ప్రజాస్వామిక విధానాల్లో జోక్యం చేసుకోవద్దు అని సూచించారు. రక్షణ కవాటాన్ని (సేఫ్టీ వాల్వ్) మూసివేస్తే వేర్వేరు సమస్యలు వస్తాయని రాహుల్ హెచ్చరించారు.
మిశ్రా బర్తరఫ్`నిందితుల అరెస్టు : తికైత్ డిమాండు
లఖింపూర్ ఖేరి ఘటన నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని బీకేయూ నేత రాకేశ్ తికైత్ డిమాండు చేశారు. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని అధికారులను హెచ్చరించారు. రైతులతో కుదిరిన ఒప్పందం వారంలో అమలు కావాలన్నారు. హింసాకాండ అనంతరం తికైత్ జోక్యంతో నిరసనకారులు వెనక్కు తగ్గారు. బాధిత కుటుంబాలకు రూ.45లక్షల నష్టపరిహారం ఇస్తామని, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ నిర్వహిస్తామని యూపీ ఏడీజీఐ ప్రశాంత్ కుమార్ వెల్లడిరచారు. ‘మా ఆందోళనను విరమించాం. ఒప్పందం ప్రకారం ఎనిమిది రోజులు వేచిచూస్తాం. ఆలోగా తగిన చర్యలు తీసుకొని హామీలను అమలు చేస్తే సరే.. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతాం’ అని బుధవారం లఖింపూర్ గురుద్వారా వద్ద విలేకరులతో తికైత్ అన్నారు.
కాంగ్రెస్‌వి అవకాశ రాజకీయాలు.. : బీజేపీ
లఖింపూర్ ఘటనను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అవకాశ రాజకీయాలు చేస్తోందని బీజేపీ విమర్శించింది. దేశంలో నిరంకుశత్వం రాజ్యమేలుతుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. ‘నిర్లక్ష్యం’ రాహుల్‌కు మారుపేరని వ్యాఖ్యానించారు. హింసను ప్రేరేపించేలా ప్రజలను రెచ్చగొట్టేందుకు చేయగలిగినదంతా కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. లఖింపూర్‌ఖేరిలోకి ప్రతిపక్ష నేతలను అనుమతించకపోవడానికి కారణంగా శాంతి భద్రతలను కాపాడటమే అని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నందునే మీరు విలేకరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ రాహుల్‌నుద్దేశించి అన్నారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గురించిగానీ రైతుల గురించిగానీ పట్టడం లేదన్న ఆయన వారు తమ విలాసాలు పోకుండా జాగ్రత్తపడుతున్నారని విమర్శించారు.