Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

పార్లమెంట్‌లో ‘వక్ఫ్‌’ మంటలు

. సవరణ బిల్లుపై భగ్గుమన్న ‘ఇండియా’ ఎంపీలు
. మతస్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగంపై దాడిగా అభివర్ణన
. వెనక్కి తగ్గిన మోదీసర్కారు…జేపీసీకి పంపేందుకు అంగీకారం

న్యూదిల్లీ:విపక్ష ఇండియా ఐక్యసంఘటన తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై మోదీ సర్కారు యూటర్న్‌ తీసుకుంది. వక్ఫ్‌ సవరణ బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీి(జేపీసీ)కి పంపింది. వక్ఫ్‌ చట్టంలో మార్పులు తీసుకువస్తూ మోదీ సర్కారు రూపొందించిన సవరణ బిల్లు గురువారం లోక్‌సభ ముందుకు రాగా… విపక్ష ఇండియా ఐక్యసంఘటన ఎంపీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని పంపుతామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా కిరణ్‌ రిజిజు గురువారం దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై సభలో చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్‌ దీన్ని ఖండిరచింది. ముస్లింల హక్కుల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తాము అంగీకరించేదే లేదని, బిల్లును తక్షణమే వెనక్కు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.
మతస్వేచ్ఛపై దాడి: కాంగ్రెస్‌
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి కోరిన వెంటనే, కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ దానిని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నోటీసు సమర్పించారు. ప్రభుత్వం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, దాని ద్వారా సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని ఆరోపించారు. ఇది క్రూరమైన చట్టమని, రాజ్యాంగంపై దాడి అని వేణుగోపాల్‌ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విభజన రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినప్పటికీ హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ‘ఇది మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి… తదుపరి మీరు క్రిస్టియన్లు, తరువాత జైనుల్ని లక్ష్యం చేసుకుంటారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విభజన రాజకీయాలను దేశ ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు.
` ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ… బీజేపీ తన కరడుగట్టిన మద్దతుదారులను ప్రసన్నం చేసుకునేందుకే ఈ బిల్లును తీసుకొచ్చిందన్నారు. ‘ఇతర మత సంస్థలలో ఇలా చేయనప్పుడు ముస్లిమేతరులను వక్ఫ్‌ బోర్డుల్లో చేర్చడం ఏమిటి?’ అని యాదవ్‌ ప్రశ్నించారు. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. బోర్డులో సభ్యులను ఎందుకు నామినేట్‌ చేయాలని ప్రశ్నించారు. ఏ మత సంస్థలలోనూ ఆయా కమ్యూనిటీకి చెందని వ్యక్తులు భాగస్వామ్యంగా ఉండరని, వక్ఫ్‌ సంస్థల్లో ముస్లిమేతరులను చేర్చడంలో ప్రయోజనం ఏంటని నిలదీశారు. ఈ బిల్లు మత స్వేచ్ఛకు విరుద్ధమని సమాజవాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్వీ అన్నారు. సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించడం అంటే… ఇతర సంస్థలలో ముస్లింల హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, సమాఖ్య స్ఫూర్తిని కాలరాయడమేనని విమర్శించారు. ‘ఇది ఆర్టికల్‌ 30 యొక్క ప్రత్యక్ష ఉల్లంఘన… ఈ బిల్లు నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకునే తీసుకొచ్చారు. రాజ్యాంగానికి విరుద్ధం’ అని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు.
స్టాండిరగ్‌ కమిటీకి పంపాలి: ఎన్సీపీ
బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం సమగ్ర సంప్రదింపులు జరపలేదని ఎన్సీపీ(శరద్‌ పవార్‌) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును స్టాండిరగ్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశారు. ఉన్నపళంగా కేంద్రం ఈ బిల్లు తీసుకురావడానికి వక్ఫ్‌ బోర్డులో అకస్మాత్తుగా ఏమి జరిగింది అని ప్రశ్నించారు. ‘బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందో చూడండి. చాలా బాధగా ఉంది… మైనారిటీలను రక్షించడం దేశం నైతిక బాధ్యత’ అని సూలే అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 25, 26, 30లను ఉల్లంఘిస్తోందని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయుఎంఎల్‌) సభ్యుడు ఇటి మహమ్మద్‌ బషీర్‌ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్‌ వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. వక్ఫ్‌ భూముల ఆక్రమణలను ఈ బిల్లు ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
ప్రాథమిక హక్కులకు భంగం: ఒవైసీ
మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ… వక్ఫ్‌ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్‌ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్‌ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్‌-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. కాగా బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్‌ రెడ్డి కోరారు. ఇక ఈ బిల్లును టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు తెలిపాయి.
బిల్లును సమర్థించుకున్న ప్రభుత్వం
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వక్ఫ్‌ చట్టంలోని సమస్యలను పరిష్కరించలేకపోయినందున తమ ప్రభుత్వం సవరణలు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. ‘మీకు చేతకాకపోవడంతో ఈ సవరణలు తీసుకురావాల్సి వచ్చింది. మేం ఎన్నికైన ప్రజాప్రతినిధులం, ఈ బిల్లుకు మద్దతివ్వండి, కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందుతారు.. కొందరు వక్ఫ్‌ బోర్డులను కబ్జా చేశారు. సామాన్య ముస్లింలకు న్యాయం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చాం. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులు మాఫియాగా మారాయని చాలామంది ప్రతిపక్ష నాయకులు నన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పారు. నేను వారి పేర్లను బహిరంగంగా చెప్పి వారి రాజకీయ జీవితాన్ని నాశనం చేయలేను’ అని రిజిజు తెలిపారు. ‘సచార్‌ కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించాం. బిల్లుపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపాం. దీని వల్ల మతపరమైన స్వేచ్ఛకు ఆటంకం ఉండదు. ఇతరుల హక్కులను హరిస్తుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇప్పటివరకు హక్కులు పొందని వారికి దీంతో ప్రయోజనం చేకూరుతుంది. వక్ఫ్‌ బోర్డులను మాఫియా ఆక్రమించిందని చాలా మంది ఎంపీలు చెప్పారు. కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా మద్దతు ఇవ్వలేమని చెప్పాయి. వక్ఫ్‌ బోర్డులో వివిధ మతాల సభ్యులుండాలని మేం చెప్పట్లేదు. పార్లమెంట్‌ సభ్యుడు మాత్రం బోర్డులో ఉండాలంటున్నాం’ అని కేంద్రమంత్రి వివరించారు. కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్‌ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ సర్కారు ఎప్పట్నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img