Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

పాలకులు ధరలపైమాట్లాడరేం?

. రేపటి నుంచి ధరల పెరుగుదలపై సీపీఐ ఆందోళన
. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తగదు
. సినీ నటి వ్యవహారంలో కఠిన శిక్షలుండాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర – విజయవాడ : నిత్యావసరాల ధరలు నానాటికీ పెరిగిపోతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకుండా ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కేవలం ఎన్నికల సమయంలో తప్ప రాజకీయ పార్టీలు అధిక ధరలను గురించి ప్రస్తావించడం లేదన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు సెప్టెంబరు 1 నుంచి ఏపీలోని అన్ని నియోజకవర్గాలలో పెరిగిన ధరలను తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలనే తదితర డిమాండ్లతో పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడిరచారు. స్థానిక దాసరి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ‘ధరల పెరుగుదలపై సీపీఐ ఆందోళన’ కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ, జంగాల అజయ్‌కుమార్‌తో కలిసి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ 2014లో గద్దెనెక్కినపుడు వంట గ్యాస్‌ రూ.400 ఉండగా, నేడు రూ.950కి చేరిందన్నారు. నాడు లీటర్‌ పెట్రోలు రూ.60 ఉండగా, ప్రస్తుతం రూ.110కు, లీటర్‌ డీజిల్‌ ధర రూ.100కు చేరిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 200 శాతం పెరిగాయని, కిలో బియ్యం రూ.70, కందిపప్పు రూ.210, వేరుశనగనూనె రూ.220కు చేరడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. విద్యుత్‌ చార్జీలు అధికంగా పెరిగాయ న్నారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు, పేద వర్గాలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కేవలం నాసిరకం బియ్యం పంపిణీ చేసి చేతులు దులుపుకుం టున్నాయే తప్ప 14 రకాల నిత్యావసర వస్తువులను చౌక డిపోల ద్వారా పంపిణీ చేయడం లేదన్నారు. చాలా కాలంగా రేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవ టంతో పేదలు కష్టాలు పడుతున్నారని చెప్పారు. జనాభా గణన జరగలేదనే సాకుతో కొత్తగా రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదన్నారు. ధరల తగ్గింపు, రేషన్‌ కార్డుల మంజూరుపై సీపీఐ అధ్వర్యంలో సెప్టెంబరు 1 నుంచి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు, సెప్టెంబరు 6న అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించనున్నామని, ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీలను, ఎంపీలను టీడీపీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పెద్దల సభగా గౌరవింపబడే రాజ్యసభ సభ్యులు అమ్ముడుపోయి పార్టీలు మారుతున్నారంటే ఇంతకంటే నీచమైన విషయం ఏదీలేదన్నారు. రాష్ట్రంలో అధికార కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, దీంతో జగన్‌మోహన్‌ రెడ్డికి అసెంబ్లీకి రావడానికి మనసొప్పడం లేదన్నారు. రాజ్యసభ, లోక్‌సభల్లో ఉన్న వైసీపీ పార్లమెంటు సభ్యులంతా 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వానికే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించలేదని, చంద్రబాబుకు సీనియర్‌ రాజకీయ వేత్తగా, ముందుచూపు ఉన్న నేతగా, పరిపాలనా దక్షుడుగా పేరుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే నమ్మకంతో ప్రజలు తీర్పునిస్తే దాన్ని దుర్వినియోగం చేస్తున్నా రని విమర్శించారు. తరచూ యువత గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు రాబోయే యువతరానికి, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి పార్టీ ఫిరాయిం పులనే సందేశంగా పంపనున్నారా? అని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌ రెడ్డి, చంద్రబాబు అధికారంలో ఎవరుంటే వాళ్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. గంధపు చెక్కల స్మగ్లర్‌ బీజేపీలో చేరతానంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ‘బీజేపీలో స్మగ్లర్లను, నేరగాళ్లకు అవకాశమివ్వమని చెప్పకుండా, బీజేపీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని’ చెప్పడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎన్టీఆర్‌ కూతురిగా గౌరవింపబడే పురందేశ్వరి స్మగ్లర్లను, నేరగాళ్లను బీజేపీలో చేర్చుకోవాలనుకోవడం సరైంది కాదన్నారు. ప్రజాతంత్ర వాదులంతా అనైతిక రాజకీయాలను, పార్టీ ఫిరాయింపులను ముక్తకంఠంతో ఖండిరచాలని కోరారు.
ముంబై నటి వివాదం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు రామకృష్ణ సమాధానమిస్తూ ముంబై నటి వివాదంలో పెద్ద పెద్ద వారి ప్రమేయం ఉన్నట్లు వార్తలొస్తున్నాయని, ఆమె సినీ నటి అయినా, టీవీ నటిగానీ, నటి కాకపోయినప్పటికీ ఒక మహిళపై జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఇందులో ఎవరు ప్రమేయం ఉన్నప్పటికీ వారిపై కఠిన శిక్షలు ఉండాలన్నారు. అదే పోలీసు అధికారుల ప్రమేయం ఉంటే మాత్రం కచ్చితంగా శిక్షలు మరింత కఠినంగా ఉండాలన్నారు. ఖాకీ దుస్తులు వేసుకుని, ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నామనే విషయాన్ని మరచి ప్రభుత్వ అనుకూలురుగా, వంధిమాగధలుగా మారిపోతున్నారన్నారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో కూడా పోలీసు అధికారులు, ఎమ్మెల్యేకి డబ్బులిచ్చి, పోస్టింగ్‌లు వేయించుకుంటున్న పోలీసులంతా డబ్బు కోసమే పనిచేస్తారన్నారు. గుంటూరులో ఎమ్మెల్యే భర్త ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడతామని బెదిరించడాన్ని ఖండిరచారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను, అధికారులను నియంత్రించాలని కోరుతున్నామన్నారు. సినీ నటి వ్యవహారంలో ఐపీఎస్‌లుగానీ, రాజకీయ నేతలుగానీ, అంతకు మించి ఎవరున్నప్పటికీ కఠిన చర్యలుండాలని, భవిష్యత్‌లో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img