: మమతాబెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.గోవాలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘దేశంలో ద్రవ్యోల్బణం అంతకంతకే పెరిగిపోతున్నదని, గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు అసలు అడ్డుకట్టేలేదని విమర్శించారు. జీఎస్టీ కారణంగా దాదాపు అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని అన్నారు. అయినా అధికార బీజేపీకి సమస్యలను పరిష్కారించాలన్న సోయి లేదని అన్నారు. పైగా, వాళ్లు అచ్చేదిన్ (మంచి రోజులు) రానున్నాయని చెబుతున్నారు. కానీ దేశం ఇప్పటికే సర్వనాశనం అయిపోయిందని మండిపడ్డారు. బీజేపీయేతర శక్తులన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి ఆ పార్టీని అంతటా ఓడిరచడమే లక్ష్యంగా తాము పోరాడుతామని మమతాబెనర్జ్జీ చెప్పారు. కొద్దిసేపటి క్రితమే గోవా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో మాట్లాడానని, కలిసి పోటీచేసే విషయంపై ఇద్దరం చర్చించామని అన్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆయన ఇష్టమని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలి పోకూడదనేది తన ఉద్దేశమన్నారు.