కిడ్నీ బాధిత గ్రామాల్లో రక్షిత తాగునీటి కోసం ఉద్యమం
సీపీఐ ‘ప్రజారోగ్య పరిరక్షణ యాత్ర’ ప్రారంభం
విశాలాంధ్ర – విజయవాడ : కృష్ణానది చెంతనే ఉన్నా… గ్రామీణ ప్రజలకు రక్షిత మంచినీరు అందడంలేదు. ఫ్లోరైడ్, సిలికాన్ మూలకాలు కలిగిన కలుషిత నీటిని తాగి కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు, గంపలగూడెం మండలాలల పేద ప్రజలు కిడ్నీ వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోతు న్నారు. ఎన్నో ఏళ్లుగా తమకు రక్షిత మంచినీరు సరఫరా చేయాలని స్థానికులు, వామపక్షాలు అనేక ఉద్యమాలు చేసినా… వందలమంది ప్రాణాలు కోల్పోయినా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరిపించి పేదల ప్రాణాలను కాపాడేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నడుం బిగించింది. తిరువూరు నియోజకవర్గానికి కృష్ణాజలాలు సరఫరా చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రగా ఎర్రసైన్యం కదం తొక్కింది. ప్రజల ప్రాణాలు పోతున్నా కిడ్నీ బాధితుల గోడు పాలకులకు పట్టడంలేదని, కూత వేటు దూరంలో కృష్ణాజలాలు ఉన్నా సచేశారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్వర్యంలో పాడెక్కుతున్న ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని చేపట్టిన ‘ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర’ను ఎ.కొండూరు డయాలసిస్ సెంటర్ వద్ద రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఏ.కొండూరు నుంచి విజయవాడ వరకు దాదాపు వంద కిలో మీటర్లు ‘ప్రజారోగ్య పరిరక్షణ పాదయాద్ర’ సాగనుంది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… రాయలసీమ వంటి ప్రాంతాల్లో నీళ్లు లేవంటే అర్థముందికానీ కృష్ణానది చెంతనే ఉన్నా జిల్లాలోని గ్రామాలకు నీటి కష్టాలు ఉన్నాయంటే పాలకులు సిగ్గుపడాలన్నారు. కిడ్నీ బాధితుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళతామన్నారు. కిడ్నీ బాధితులకు నెలకు రూ.10వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితులతో పాదయాత్రలో పాల్గొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడు బర్మావతు కృష్ణారావు(33)కు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కృష్ణాజలాల సరఫరా నిమిత్తం పైపులైన్ నిర్మాణం కోసం తీసుకువచ్చిన పైపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆగిపోయిన పైపులైన్ పనులు, రిజర్వాయర్ల నిర్మాణం పనుల వివరాలను స్థానికులు రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రూ.50 కోట్లతో కృష్ణాజలాలను పైపులైన్ ద్వారా సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం… ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకేయలేదన్నారు. కృష్ణాజలాల తరలింపు ప్రాజెక్టుకు కేంద్ర ‘జలజీవన్ మిషన్’ ఆమోదం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించక పోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటానికి అవసరమైతే కిడ్నీ బాధితులను అసెంబ్లీకి కూడా తీసుకెళతామని చెప్పారు. కాగా ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రకు తిరువూరు నియోజక వర్గ శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సంఫీుభావం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మేలు చేసే అంశాలను ఏ పార్టీ సూచించినా స్వీకరిస్తామని చెప్పారు. మాజీ శాసన సభ్యులు నల్లగట్ల స్వామిదాసు ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. కిడ్నీ బాధితుల పక్షాన పోరాటం చేస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ నేడు ఉపముఖ్యమంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నారని… వెంటనే కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు పి.ఆనందరావు పాదయాత్రకు సంఫీుభావం ప్రకటించారు. పాదయాత్ర చీమలపాడు గ్రామంలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం అమరవీరుల స్థూపం నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, సీపీఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, తూము కృష్ణయ్య, వల్లంకొండ బ్రహ్మం, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య, నాయకులు శర్మ అభ్యుదయ గీతాలు ఆలపించారు.రఫరా చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆవేదన వ్యక్తం