Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

పోటెత్తిన వరద

ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత…దిగువకు నీటి విడుదల
కృష్ణా పరివాహక ప్రాంతాలు అప్రమత్తం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి/ కర్నూలు/ విజయపురిసౌత్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోకి ఎవ్వరూ వెళ్లవద్దని హెచ్చరించారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 2.8లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు వచ్చింది. ఎగువ శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాలు నిండిపోవడంతో వాటి గేట్లను ఎత్తివేశారు. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. బుధవారం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేసి దిగువకు 73వేలకుపైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కేఈబీ, రైవస్‌, బందరు కాల్వల ద్వారా 13,477కుపైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు భారీగా వరద నీరు వెళ్లడంతో లోతట్టు ప్రాంత ప్రజలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. దీంతో కృష్ణానదీ పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సమయంలో నాటు పడవలతో నదిలోకి ప్రయాణించవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112 అందుబాటులో ఉంచారు. వరద పోటెత్తడంతో కృష్ణా, ఎన్టీఆర్‌జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. వరద ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంత అధికారులను ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో జలాశయం నుంచి సాగర్‌కు నీటి విడుదల చేస్తున్నారు. బుధవారం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేసి 4,02,984 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ ఉత్పత్తికి 64,738 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువనున్న జూరాల, సుంకేసుల నుంచి 3,11,439 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం 883.అడుగుల మేర నీరు ఉంది. జలాశయం నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిలువ ఉన్నాయి.
సాగర్‌కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి బుధవారం 18 రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా 2,24,574 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 584.60 అడుగుల మేర నీరు ఉంది. అదనంగా వచ్చే నీటినంతటినీ దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 6,873, ఎడమ కాల్వకు 8,199 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. క్రస్ట్‌ గేట్ల ద్వారా భారీగా నీరు విడుదలవుతున్న దృశ్యాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకోవడంతో సాగర్‌లో సందడి వాతావరణం నెలకొంది.
కృష్ణానదిని తిలకించిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబునాయుడు విజయవాడలో చేనేత దినోత్సవానికి హాజరై తిరిగి ఉండవల్లికి వెళ్తున్న క్రమంలో ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్‌ ఆపి కిందకు దిగారు. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి వారితో సీఎం మాట్లాడారు. కృష్ణమ్మకు నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, తాజా పరిస్థితిపై చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img