ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ వచ్చే ఏడాది జరగనున్న తరుణంలో ఆ రాష్ట్ర పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రిన్సిపల్ సలహాదారుగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు.తదుపరి చర్యపై తానింకా నిర్ణయం తీసుకోవలసి ఉందని. తాను తాత్కాలికంగా విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు ఆయన పంజాబ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘మీ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించలేను..దయచేసి నన్ను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’. అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ క్రియాశీల రాజకీయాల్లోకి దిగనున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.