Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ప్రాథమిక పాఠశాలలకు ఎసరు?

. పది మంది లోపు విద్యార్థులుంటే మూత
. ఒక్క కడపలోనే 302 పాఠశాలలు గల్లంతు!
. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో పది మంది లోపు విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేతకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. సర్దుబాటు సాకుతో ఈ తరహా చర్యలకు ఉపక్రమించడంపై సర్వత్రా వ్యతిరేకత నెలకొంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే… ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలకు సిద్ధమవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో 117 జీవో రద్దు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం… దానికంటే అధికంగా నష్టం చేసే చర్యలకు పాల్పడుతోందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఎలాంటి చర్చలు, సంప్రదింపులు చేపట్టకుండా, ఇలా ఏకపక్షంగా నిర్ణయాలకు సిద్ధమవుతున్న తీరును తూర్పారబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో లక్షా 80 వేల మంది ఉపాధ్యాయులుగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కేటగిరీల వారీగా చూస్తే… 6 వేల ఉన్నత పాఠశాలలు, 5 వేల ప్రాథమికోన్నత, 34 వేల ప్రాథమిక పాఠశాలలున్నాయి. 12,683 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు కొనసాగుతున్నారు. దీనికి కారణం గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 విధానాలే. ఈ జీవో 117 ద్వారా 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దాని ప్రభావంతో 4 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. కేవలం ప్రాథమిక పాఠశాలలను 1,2 తరగతులకే పరిమితం చేశారు. ఈ విధానాలపై నాడు ఉపాధ్యాయ సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. తక్షణమే జీవో 117 రద్దు చేసి, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశాయి. 3,4,5 తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లోకి పంపడంతో దానివల్ల అక్కడ విద్యార్థులకు వాతావరణం అనుకూలించక అసౌకర్యానికి గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు జీవో 117 రద్దు చేసి, ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి. దాని ప్రకారమే ఉపాధ్యాయ వర్గాలు పెద్దఎత్తున కూటమి గెలుపునకు సహకరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 117 రద్దుపై మౌనం దాల్చుతోంది. ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో జీవో117 రద్దు అంశంపై సభ్యులు మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, విద్యాపరమైన అన్ని సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయ సంఘాలతో భేటీ ఏదీ?
ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇంతవరకు భేటీ అవ్వలేదు. వారితో చర్చించకుండా ప్రాథమిక పాఠశాలల విలీనానికి కసరత్తు చేయడాన్ని తప్పుపడుతున్నారు. పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తే… ఒక్క కడప జిల్లాల్లోనే 302 ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఈ విధానం జీవో 117 కంటే దారుణమైనదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఉన్న విద్యా రంగ సమస్యలు యథాతథంగా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల స్టడీటూర్‌ పేరుతో ఉపాధ్యాయులను పది రోజులపాటు శిక్షణ తరగతులకు పంపారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు దూరమయ్యాయి. ఇలాంటి అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యాప్‌ల విధానం ఇంకా కొనసాగడంపై ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా విద్యార్థులు, వారికి అందించే సంక్షేమ పథకాల వివరాలను ఉపాధ్యాయులే నమోదు చేస్తున్నారు. గతంలో ఇందుకోసం నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని పెట్టాలన్న డిమాండ్లు వచ్చినప్పటికీ, దానిపై ఆలోచనలేదు. తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసే ఆలోచనను విరమించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img