హంతకులు కళ్ల ముందే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రానే ఆ ప్రమాదానికి కారణమని చాలా వీడియోల్లో కనిపిస్తూనే ఉంది. అయినా ఇప్పటివరకు కూడా అతనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదని అన్నారు. ముందు అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తప్పించాలని, అతను కేంద్రమంత్రిగా ఉన్నంతవరకు బాధితులకు న్యాయం జరగదని అన్నారు.న్యాయం పొందడం ప్రజల హక్కని, బాధితులకు న్యాయం అందే వరకు తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు. లఖీంపూర్ ఖేరికి వెళ్లేందుకు ఎట్టకేలకు బుధవారం పోలీసులు అనుమతివ్వడంతో రాహుల్, ప్రియాంక ఇతర కాంగ్రెస్ నేతల బృందం.. లఖీంపూర్ ఖేరీకి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించింది.