London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

బెజవాడలోనే70 ఎకరాల ఆక్రమణ

ఆపరేషన్‌ బుడమేరు షురూ : మంత్రి నిమ్మల

. 3 వేల నిర్మాణాలున్నట్లు గుర్తింపు
. ఆక్రమణల తొలగింపునకు అధికారులు సిద్ధం
. సీఎం ఓకే అనగానే పనులు ప్రారంభం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు పది రోజులపాటు విజయవాడ నగర ప్రజలకు నరకం చూపించిన బుడమేరు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బుడమేరు వరద ప్రవాహ ప్రదేశం ఆక్రమణకు గురి కావడమే భారీ నష్టానికి ప్రధాన కారణంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్‌ బుడమేరు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా జలవనరులశాఖ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, సర్వే అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయంలో మూడు రోజులుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుండి పాత ఛానల్‌, విజయవాడ నగరం, గుడివాడ నుండి కొల్లేరు మీదుగా బుడమేరు వెళుతుంది. వెలగలేరు, కవులూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండి విద్యాధరపురం, విజయ వాడలోని 14,15,16 వార్డులకు సంబంధించి గుణదల, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు వరకు మొత్తంగా 13.25 కిలోమీటర్లు వరకు బుడమేరు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. ఇందులో ఎక్కువ వ్యవసాయ ఆక్రమణలున్నట్లు అధికారులు వెల్లడిరచారు. విద్యాధర పురం నుండి గుణదల వరకు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 202 ఎకరాలకుగాను 70 ఎకరాలు ఆక్రమణకు గురి కాగా, వీటిలో 3051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ బుడమేరు విస్తరణ ఎంత, ఇందులో ఆక్రమణలు ఎంత అయ్యాయో గుర్తించామని తెలిపారు. ప్రతి పదేళ్లకు ఒకసారి వరదలతో ముంచెత్తుతూ బెజవాడ దుఃఖదాయనిగా గుర్తింపు పొందిన బుడమేరుకు భవిష్యత్‌లో ఆ పేరు లేకుండా, విజయవాడను ముంపు రహిత నగరంగా మార్చేలా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యం మేరకు త్వరలో ప్రక్షాళన పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీిల సామర్ధ్యం పెంచాల్సిన అవసరం ఉందని, ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు వెళ్లే 50.6 కిలో మీటర్ల కాలువ గట్లను మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ఈ గట్టును ఎంత మేర, ఎక్కడెక్కడ బలోపేతం చేయాలి? లైనింగ్‌, విస్తరణ పనులు ఎంత మేర చేయాలో సమీక్షించామని తెలిపారు. బుడమేరు పాత ఛానెల్‌ అంతా నగరంలోని ఇళ్ల మధ్య నుండి ప్రవహిస్తున్నదున… దీనికి సమాం తరంగా వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుండి పాముల కాలువ, ముస్తాబాద్‌ కెనాల్‌ మీదుగా ఎనికేపాడు కెనాల్‌ను విస్తరణ చేయడం ద్వారా బుడమేరుకు వచ్చే వరద నీటిని మళ్లించే అవకాశం ఉంటుందన్నారు. అందుచేత పాముల కాలువ, ముస్తాబాద్‌ కాలువలు ఇరిగేషన్‌పరంగా ఎంత వరకు విస్తరణ చేయవచ్చో పరిశీలించి… ఈ ప్రాంతంలో అంతా వ్యవసాయ భూములే కాబట్టి అక్కడ దీనికి ఉన్న అవకాశాలను గుర్తించాలని అధికారులకు సూచించామన్నారు. ఇలా అన్ని అంశాలూ ఒక కొలిక్కి వచ్చిన తరువాత సమగ్ర నివేదిక సిద్ధం చేసుకుని కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని, ఆయన ఆదేశాలకనుగుణంగా బుడమేరు ఆపరేషన్‌ ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img