దేశంలో కొత్తగా 12,428 పాజిటివ్ కేసులు
దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు 8 నెలల కనిష్టానికి తగ్గి 12వేలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారినపడి 356 మంది మరణించారు. వైరస్ నుంచి మరో 15,951 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. దేశంలో ప్రస్తుతం ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,63,816కు చేరుకుంది. కేరళలో నిన్న ఒక్కరోజే కొత్తగా 6,664 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 53 మంది మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది.