దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండవ రోజు, లక్ష కంటే తక్కువగా కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 67,597 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా , 1188 మంది సోకిన మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 1,80,456 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,94,891కి చేరింది. కొవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది. దేశ వ్యాప్తంగా కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,02,874కి చేరింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,70,21,72,615గా ఉంది.