బెంగాల్ ఘటనపై నారాయణ
పాట్నా: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పిలుపు మేరకు అధిక ధరలకు నిరసనగా సెప్టెంబరు 1`7 తేదీల్లో చేపట్టే నిరసన వారోత్సవాన్ని జయప్రదం చేయాలని పార్టీ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని సూచించారు. మోదీ ప్రభుత్వ మెడలు వంచి పేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సీపీఐ పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర డిమాండ్ సాధనకూ సంపూర్ణ మద్దతిస్తోందని తెలిపారు. బెంగాల్‌లో వైద్యురాలి హత్యాచార ఉదంతంలో న్యాయం జరుగుతుందని, దోషులకు కఠిన శిక్షలు పడతాయని ఆశిస్తున్నట్లు నారాయణ వెల్లడిరచారు. ఈ ఘటన వెనుక మమత సర్కార్ పాత్ర నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. సీపీఐ బీహార్ కార్యదర్శి రామ్‌నరేశ్ పాండే, కార్యదర్శివర్గ సభ్యుడు రాంబాబు కుమార్‌తో కలిసి బీహార్ రాజధాని పాట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. బెంగాల్‌లో వైద్యురాలు, బీహార్‌లో విద్యార్థినిపై హత్యాచారాలను ప్రస్తావించారు. తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. బెంగాల్ వైద్యురాలిపై హత్యాచారం వెనుక ఆ రాష్ట్ర ప్రభుత్వ రహస్య హస్తం నిగ్గు తేలాల్సి ఉందన్నారు. తుది తీర్పు సమగ్రంగా వెలువడుతుందని, దోషులకు తగిన శిక్షలు పడతాయని భావిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు భద్రత కల్పించడంలో ఏదేని వ్యవస్థ విఫలమైతే అది ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిందన్నారు. ఆర్జీ కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో దర్యాప్తునకు టాస్క్ ఫోర్స్‌ను కోర్టు నియమించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేసిన మూడు గంటల్లోగా వైద్య కళాశాల ప్రిన్సిపల్ తిరిగి నియమితులు కావడంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ‘ప్రిన్సిపల్ ఎందుకు రాజీనామా చేశారు. 3 గంటల్లోనే తిరిగి నియమితులు కావడం ఎందుకు? వైద్యురాలిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు జరిగింది? ఈ హేయమైన నేరానికి సంబంధించి 30 మంది నిందితులు ఉన్నారు. మమతా దీదీ, మోదీ చాయ్‌వాలా చేస్తున్నదేమిటి? వారి పరిపాలనలో మహిళలకు రక్షణ లేదని తేలిపోయింది. అటు ముజఫర్‌పూర్‌లోని లాలుచప్రా గ్రామంలో తొమ్మిదో తరగతి చదవుతున్న దళిత బాలికపై హత్యాచారం నితీశ్ ప్రభుత్వ వైఫల్యానికి, జేడీయూ`బీజేపీ కూటమి నిజరూపానికి అద్దంపట్టింది’ అని నారాయణ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంటే పేదలు మరింత పేదలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దిగి రాని ధరలతో మధ్యతరగతి, పేదలు అల్లాడిపోతున్నారని, రైతులకు కనీస మద్దతు ధర అందడం లేదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగాన్ని నారాయణ ప్రస్తావించారు. కేరళ, దిల్లీ, కర్నాటక, తమిళనాడులో ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు మధ్య వివాదాలను గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుస్మృతిని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆత్మస్తుతిలో మోదీ నిమగ్నం కావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌కు మోదీకి మధ్య దూరం పెరుగుతోందని నారాయణ తెలిపారు. అదానీ లేకుండా అంగుళం కూడా కదల్లేరని పరిస్థితిలో మోదీ ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. అదానీకి ఆస్ట్రేలియా బొగ్గు గనులు కట్టబెట్టి అప్రతిష్ఠను మోదీ మూటకట్టుకున్నారని, అదానీ సంస్థల్లో ఎల్‌ఐసీ, సెబీ చైర్‌పర్సన్ మాధవి బచ్‌కు పెట్టుబడుల ఉండటంపై దేశ ప్రజలు గళం వినిపించారని అన్నారు. తాజా పరిణామాలతో మోదీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్కేక హోదా ఇవ్వనప్పుడు ఆయనను పక్కకు పెట్టేయకుండా వంత పాడటం ఎందుకని బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూను నారాయణ ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కులిపోవడం, అవామీ దళ్ ఆస్తుల ధ్వంసం, అల్లర్లు, హిందువలపై దాడులను ప్రస్తావిస్తూ లౌకికవాదులైన ముస్లింలు తోటి హిందువుల ఆస్తులను పరిరక్షిస్తుండటం ప్రశంసనీయమని అన్నారు. బంగ్లాదేశ్‌లో పరిణామాలను చూసి మనం కూడా పాఠాలు నేర్చుకోవడం అవసరమని నారాయణ హితవు