థర్డ్‌వేవ్‌లో యూపీలో తొలి కేసు..
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ దాదాపు 3 లక్షలకు సమీపించాయి. మరోపక్క తాజా ఉధృతికి ఆజ్యపోస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటివరకూ 8,961 మందిలో బయటపడిరది. దీంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భయాందోళనల మధ్య గతేడాది సెకండ్ వేవ్‌లో వణుకు పుట్టించిన బ్లాక్ ఫంగస్ మళ్ళీ పంజా విసిరడం ప్రారంభించింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 45 ఏళ్ళ వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో ఆసుపత్రిలో చేరాడు. ఇతను కాన్పూర్ లోని కాంట్ నివాసి అని, సదరు వ్యక్తికి కరోనా సోకిందని.. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ అతని కన్ను, ముక్కుకు వ్యాపించినట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా థర్డ్‌వేవ్‌లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అతన్ని బ్లాక్ ఫంగస్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ భారీగా సోకింది. ఫంగస్ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయిన విషయం విధితమే. మరోసారి కేసులు నమోదవుతుండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని, స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.