Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

మోదీ ‘యూ’ టర్న్‌ల పథకమిది

కేంద్రీకృత పింఛన్‌ పథకంపై కాంగ్రెస్‌

న్యూదిల్లీ: కేంద్రీకృత పెన్షన్‌ పథకాన్ని ప్రకటించడంపై కాంగ్రెస్‌ ఆదివారం కేంద్రంపై దుమ్మెత్తిపోసింది. యూపీఎస్‌లోని ‘యు’ అంటే మోదీ ప్రభుత్వ ‘యు-టర్న్‌లు’ అని పేర్కొంది. యూపీఎస్‌ దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులపై దాడిగా కనిపిస్తోందని ప్రతిపక్ష పార్టీ విమర్శించింది. సుమారు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరేలా భాగస్వామ్య పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) స్థానంలో కొత్తగా యూనిఫైడ్‌ పెన్షన్‌ పథకం (యూపీఎస్‌) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే తీవ్రంగా స్పందించారు. ‘యూపీఎస్‌లోని ‘యు’ అంటే మోదీ ప్రభుత్వ యు టర్న్‌లను సూచిస్తుంది! జూన్‌ 4 తర్వాత ప్రధాన మంత్రి అధికార అహంకారంపై ప్రజల శక్తి గెలిచింది’ అని ఆయన తెలిపారు. ‘మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నిర్ణయాలపై వెనక్కి తగ్గుతూ వస్తోంది. వక్ఫ్‌ బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పంపింది. బ్రాడ్‌కాస్ట్‌ బిల్లును వెనక్కి తీసుకుంది. లేటరల్‌ ఎంట్రీ ప్రకటన ఇచ్చి… దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. తాజాగా యూపీఎస్‌ విషయంలోనూ అదే జరిగింది. ఇలా ప్రతి విషయంలోనూ యూటర్న్‌ తీసుకుంటోంది’ అని ఆయన ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘మేము ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి 140 కోట్ల మంది భారతీయులను రక్షిస్తాం. జవాబుదారీతనాన్ని కొనసాగిస్తాం’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్నారు. యూపీఎస్‌ దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులపై దాడిగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్‌ ఖేరా అన్నారు. ‘చాలా రాష్ట్రాల్లో రిజర్వ్‌డ్‌ కేటగిరీకి ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితి 40 సంవత్సరాలు. యూపీఎస్‌లో ఈ పరిమితి 37 సంవత్సరాలు. ఏకీకృత పెన్షన్‌ పథకం కింద పూర్తి పెన్షన్‌ పొందడానికి 25 సంవత్సరాల సేవను అందించడం తప్పనిసరి’ అని ఖేరా తెలిపారు. అటువంటి పరిస్థితిలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగ, ఇతర వెనుకబడిన తరగతుల ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని ఎలా పొందుతారని ఆయన ప్రశ్నించారు. ‘అణగారిన వర్గాలకు అందుబాటులో ఉన్న గరిష్ఠ వయోపరిమితి సౌకర్యాన్ని రద్దు చేయాలనుకుంటున్నారా లేక పూర్తి పెన్షన్‌ను దూరం చేయాలనుకుంటున్నారా అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి’ అని ఖేరా ‘ఎక్స్‌’ పోస్ట్‌లో ప్రశ్నించారు. జనవరి 1, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి జాతీయ పెన్షన్‌ వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) కింద హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ జీతంలో 50 శాతం భరోసా కల్పించేందుకు కేంద్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది. యూపీఎస్‌ను ఎంచుకునే ఉద్యోగులు 25 సంవత్సరాల కనీస అర్హత సేవ కోసం సూపర్‌ యాన్యుయేషన్‌కు ముందు గత 12 నెలలుగా డ్రా చేసిన సగటు మూలవేతనం చెల్లింపులో 50 శాతం హామీ ఇవ్వబడిన పెన్షన్‌కు అర్హులు. అయితే కనీస పెన్షన్‌ రావాలంటే 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img