న్యూదిల్లీ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు. నిర్ధారణ పరీక్షలో కోవిడ్`19 పాజిటివ్‌గా తేలిందని సోమవారం ఆయన తెలిపారు. ‘తేలికపాటి లక్షణాలతో ఈరోజు నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి’ అని 70 ఏళ్ల రాజ్‌నాథ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.