London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

‘రిజిస్ట్రార్‌’ రూపురేఖల మార్పు

. రాచరికపు పోకడలకు ముగింపు
. కార్యాలయాల్లో స్నేహపూర్వక వాతావరణం
. గుణదలలో పోడియం తొలగింపు పనులు ప్రారంభించిన సిసోడియా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ‘రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌కు ప్రత్యేకంగా ఎత్తయిన పోడియం, బల్ల చుట్టూ ఉండే ఎర్రని వస్త్రం తొలగిపోతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కుర్చీ సైతం సాధారణ అధికారి తరహాగానే ఉంటుంది. ఆయన కుర్చీ, బల్లకు ప్రత్యేక వేదిక ఉండదు’ సబ్‌ రిజిస్ట్రార్లు సామాన్యులేనన్న భావనతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రూపు రేఖలు మార్చుతూ అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రాచరికపు పోకడల రద్దు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కోర్టుల తరహాలో బెంచ్‌లు ఉండటం బ్రిటీష్‌ పాలన నాటి నుంచి ఉంది. ఆధునిక కాలంలో కాలం చెల్లిన వాటిని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల రూపు రేఖల మార్పునకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు చేరువగా పరిపాలన ఉండాలన్న చంద్రబాబు ఆకాంక్షల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఫలితంగా ఇప్పటివరకు రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉన్న విధానాలను సమూలంగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సరళతరమైన సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్పీ సిసోడియా తెలిపారు. ఆ మేరకు పనుల ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించారు. ఒకటి రెండు రోజుల్లో కొత్త రూపులతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కనిపించేలా చర్యలకు నిమగ్నమయ్యారు.
గుణదలలో పోడియం తొలగింపు
విజయవాడ గుణదల సబ్‌రిజిస్టార్‌ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమాన్ని సోమవారం అధికారులు చేపట్టారు. ఆర్పీ సిసోడియా ముఖ్య అతిథిగా హాజరవగా, స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్ల ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎం.వి.శేషగిరిబాబు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, గుణదల జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లు కె.ప్రసాద్‌రావు, ఎం.కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రార్‌ ఉండే కుర్చీని నేల ఎత్తుకు మార్చేశారు. ఇటీవల సిసోడియా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటనలు నేపథ్యంలో అక్కడి బ్రిటీష్‌ పోకడలను గుర్తించి మార్పులు తప్పనిసరని భావించారు. సబ్‌రిజిస్ట్రార్‌ ముందు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచడం ద్వారా రిజిస్ట్రేషన్‌కి వచ్చిన ప్రజలు కూర్చుని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ మార్పులతో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యే వరకు కొనుగోలు, విక్రయ దారులు నిలబడాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి కార్యాలయానికి వచ్చిన వారు నిల్చోవలసిన అవసరం లేదు. లావాదేవీల సమయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ సమక్షంలో కూర్చునే పని పూర్తి చేయించుకోవచ్చు.
ఇది గొప్ప సంస్కరణ : ఆర్పీ సిసోడియా
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రూపు రేఖలను మార్చడం గొప్ప సంస్కరణగా తాను భావిస్తున్నానని, ప్రజలకు ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ సేవకులేనని రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేదని, నా చిన్నప్పుడు చాలా మంది బ్యాంకులకు వెళ్లాలన్నా భయపడే వారన్నారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి నేరుగా తమ అభిప్రాయాలు చెబుతున్నారన్నారని అన్నారు. సీఎం చంద్రబాబు… ప్రభుత్వ అధికారులను ప్రజా సేవకు ముందుండాలని ఆదేశించారని సిసోడియా చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు కల్పిస్తున్న క్రయి విక్రయదారులను ఎంతో మర్యాద పూర్వకంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనాలు, పోడియాలను తొలగించి, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు కల్పించే తరహాగా సౌకర్యాలు చేపడుతున్నామని చెప్పారు.
వివిధ పనులపై వచ్చే ప్రజలను మర్యాదగా చూస్తూ… వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ క్రయ, విక్రయదారులకు సేవలందించాలని సిసోడియా ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img