Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

‘వక్ఫ్‌’పై కేంద్రం ఉక్కిరి బిక్కిరి

బిల్లుపై మిత్రపక్షం జేడీ(యూ) ఆందోళన
ఇప్పటికే ఎల్‌జేపీ, టీడీపీ ప్రశ్నల వర్షం

న్యూదిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షాల నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయి. నితీశ్‌ కుమార్‌కు చెందిన జనతాదళ్‌ (యునైటెడ్‌) ప్రభుత్వ వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే మరో రెండు మిత్రపక్షాలు చిరాగ్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌), ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూడా బిల్లుపై అనేక సందేహాలు లేవనెత్తాయి. దీంతో మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారం నిలుపుకోవడంలో కీలకంగా మారిన జేడీ(యూ), టీడీపీ ముస్లిం సమాజ ప్రయోజనాలను కాపాడే వక్ఫ్‌ సవరణ బిల్లును డిమాండ్‌ చేశాయి. ఈ రెండు పార్టీలకు లోక్‌సభలో 28 మంది ఎంపీల బలం ఉంది. ఇదిలాఉండగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో 18 శాతం ఉన్న ముస్లింల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతిపాదిత చట్టంలో మార్పులు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి నితీశ్‌కు చెందిన పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో లోక్‌ సభలో జరిగిన చర్చలో జేడీ(యూ) ఎంపీ రాజీవ్‌ రంజన్‌ చట్టానికి అనుకూలంగా మాట్లాడారు. రంజన్‌ పారదర్శకత కోసం చాలా అవసరమైన చర్యగా సవరణలను ప్రతిపాదించారు. అప్పటి నుంచి జేడీ (యూ) వర్గాలలో అసంతృప్తి ఉంది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహ మ్మద్‌ జమాఖాన్‌ కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేయడానికి ముఖ్యమ ంత్రిని కలిశారు. ఈ విషయంపై ఖాన్‌ మాత్రమే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. జల వనరుల శాఖ మంత్రి విజయ్‌ కుమార్‌ చౌదరి కూడా ముస్లిం సమాజం ఆందోళనల గురించి మాట్లా డారు. మంత్రి చౌదరి… ముఖ్యమంత్రి నితీశ్‌కు అత్యంత సన్నిహితుడిగా కనిపిస్తారు. ఎమ్మెల్యే గులాం గౌస్‌ వంటి ఇతర జేడీయూ నేతలు కూడా సందేహాలు వ్యక్తం చేసినట్లు నివేదికలు తెలిపాయి. కొత్త చట్టంలోని సెక్షన్లపై స్పష్టంగా పెరుగుతున్న అభ్యంతరాల ఫలితంగా జేడీ(యూ) కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌ రaా, మంత్రి ఖాన్‌ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజును కలిశారు. కేంద్ర, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుల పని తీరులో పారదర్శకతను నిర్ధారి ంచే ప్రయత్నంగా ముస్లిం మహిళలు, ముస్లిమేతరుల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేయడంతో సహా మొత్తం 44 మార్పులను కేంద్రం సమర్థించింది. అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనలను ‘కఠినమైన’ చర్యగా, ‘సమాఖ్య వ్యవస్థపై దాడి’ గా, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ తీవ్రంగా విమర్శించాయి. విపక్షాలు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత, ‘సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి రిజిజు ఎదురుదాడికి దిగారు. ‘మీకు చేతకాలేదు. అందువల్ల మేం చేయాల్సి వచ్చింది. కొంతమంది వక్ఫ్‌ బోర్డులను కబ్జా చేశారు. సాధారణ ముస్లింలకు న్యాయం చేసేందుకు ఈ బిల్లును తీసుకొచ్చాం’ అని ఆయన ప్రకటించారు. చివరకు వక్ఫ్‌ సవరణ బిల్లుపై తీవ్ర తర్జనభర్జనలు జరగడంతో తదుపరి పరిశీలన కోసం సంయుక్త కమిటీకి పంపారు. బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌ నేతృత్వంలోని 31 మంది సభ్యుల కమిటీ గురువారం తొలి సమావేశాన్ని నిర్వహించింది. తదుపరి సమావేశం ఆగస్టు 30న జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img