Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

విద్యార్థులపై విరిగిన లాఠీ

కోల్‌కతా రణరంగం

. బెంగాల్‌ సీఎంఓ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
. లాఠీచార్జి… బాష్పవాయువు, జలఫిరంగుల ప్రయోగం
. తీవ్రంగా ప్రతిఘటించిన ఆందోళనకారులు
. మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్‌

కోల్‌కతా : ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతోపాటు రోజురోజుకూ నిరసనలు, ఆందోళనలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు మంగళవారం వీధుల్లోకి వచ్చారు.
మమత రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్‌’ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హౌరాలోని ముఖ్యమంత్రి కార్యాలయ భవన సముదాయం నబన్నాను ముట్టడిరచడానికి ‘నబన్నా అభియాన్‌’ పేరుతో హౌరా నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీని సాంత్రగచ్చి వద్ద అడ్డుకోవడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణతో కోల్‌కతా రోడ్లు రణరంగంగా మారాయి. హౌరా బ్రిడ్జి నుంచి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు. రాష్ట్ర సచివాలయం నబన్నా వరకూ విద్యార్థులు చేపట్టిన ర్యాలీని రోడ్లపైనే పోలీసులు అడ్డుకున్నారు. అయినాసరే బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటూ టియర్‌ గ్యాస్‌, జల ఫిరంగులు ప్రయోగించారు. ఒక దశలో గాల్లోకి కాల్పులు జరిపారు. ఎంజీ రోడ్‌, జీటీ రోడ్డులోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ‘మమ్మల్ని పోలీసులు ఎందుకు కొట్టారు? మేం చట్టాలను ఉల్లంఘించలేదు. చనిపోయిన డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలి’ అని నిరసనలో పాల్గొన్న ఓ మహిళ డిమాండ్‌ చేశారు. అయితే నిరసనకారుల రాళ్ల దాడిలో కొంతమంది పోలీసు అధికారులు సైతం స్వల్పంగా గాయపడ్డారు. ర్యాలీ నేపథ్యంలో సీఎం మమత నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
నలుగురు విద్యార్థుల అరెస్టు
నిరసన జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ విషయాన్ని ఎక్స్‌ వేదికగా వెల్లడిరచారు. కాగా ఆ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అదృశ్యమయ్యారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. విద్యార్థులు మిస్‌ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బెంగాల్‌ పోలీసులు ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఎవరూ అదృశ్యం కాలేదన్నది నిజమని తెలిపారు. దీనికి సువేందు బదులిస్తూ… ‘‘ఆ విద్యార్థుల కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. మమతా పోలీస్‌.. కోర్టులో కలుద్దాం’’ అని పోస్టు పెట్టారు. నిరసన ర్యాలీలు చట్టవిరుద్ధమంటూ జిల్లా యంత్రాగం ప్రకటించినప్పటికీ ‘నబన్నా అభియాన్‌’ ర్యాలీతో ముందుకు వెళ్లాలని పశ్చిమబంగా ఛాత్ర సమాజ్‌ నిర్ణయించింది. రెండు ప్రధాన ర్యాలీలను ప్లాన్‌ చేసింది. సెంట్రల్‌ కోల్‌కతాలోని కాలేజ్‌ స్క్వేర్‌ నుంచి ఒక ర్యాలీ, హౌరాలోని సాంత్రగచ్చి నుంచి మరో ర్యాలీలి తలపెట్టింది. దీంతో హౌరాలో 2వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. నలుగురు ఏడీజీలు, 13 మంది డీఐజీలు, 15 మంది ఎస్పీ ర్యాంక్‌ అధికారులు పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు చేశారు. నాలుగు వాటర్‌ కేనన్‌ ట్రక్కులను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు అప్పగించింది. హేస్టింగ్స్‌లోని ఫోర్ట్‌ విలియం గేట్లకు సివిల్‌ వలంటీర్లు గ్రీజ్‌ పూసిన దృశ్యాలు మీడియాలో వెలుగులోకివచ్చాయి. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు అధికారులు ఈ విధంగా చేశారు. నిరసన నేపథ్యంలో ప్రజాజీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. కాగా నబన్నా(సచివాలయం) ర్యాలీ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరేపితమని సీపీఎం నాయకురాలు బృందాకారత్‌ విమర్శించారు. తీవ్ర విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img