Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

వినూత్నంగా పరిశ్రమలు

. పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
. అత్యుత్తమ ఆర్థిక జోన్‌గా శ్రీసిటీని తయారు చేస్తానని హామీ
. 15 సంస్థల ప్రారంభం, మరికొన్నిటికి శంకుస్థాపన

విశాలాంధ్ర- సత్యవేడు : శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయని, వినూత్న రీతిలో అధునాతనంగా పరిశ్రమలు నెలకొల్పాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం వివిధ కంపెనీల సీఈవోలతో నిర్వహించిన భేటీలో ప్రసంగించారు. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు దగ్గరగా ఉన్న శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్‌ జోన్‌గా తయారు చేస్తానని స్పష్టం చేశారు. శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్‌ రేటింగ్‌ గుర్తింపు కోసం కృషిచేస్తున్నామన్న సీఎం… పచ్చదనం కోసం వంద శాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిరచారు. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నా యని, అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తామని తెలిపారు. గడచిన ఐదేళ్లలో పారిశ్రామిక వేత్తలకు బకాయి పడిన రాయితీలను చెల్లిస్తామని పారిశ్రామిక వాడలకు పంపిణీ చేసే నీటి పన్నుల పెంపును సమీక్షించి తగ్గించడానికి చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించిన చంద్రబాబు రూ.1570 కోట్లతో నిర్మించిన 15 పరిశ్రమలను ప్రారంభించారు. రూ.900కోట్ల తో నిర్మించనున్న మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. రూ.1200 కోట్లతో నిర్మించనున్న పరిశ్రమలకు ఆయా సంస్థల యజమానులతో ఒప్పందాలు చేసుకు న్నారు. రాష్ట్రం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని వివరించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి దేశంలో మరే రాజకీయ నాయకుడు పర్యటించనంత స్థాయిలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో తాను పర్యటించానని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటైన శ్రీసిటీని ఉత్తమ పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇప్పటికే శ్రీసిటీలో 220 కంపెనీలు ఏర్పాటయ్యాయని చంద్రబాబు తెలిపారు. ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయమన్నారు. ఆటోమేటివ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయని, 4.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల సాధన, 4 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయమన్నారు.
కొత్త రాజధాని నిర్మాణం చేపడుతున్నాం
శ్రీసిటీలో సహజంగా చల్లని వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్స్‌ ధరలు తగ్గించుకోవాలని సూచించారు. అదే విధంగా ఉత్పత్తి, లాజిస్టిక్స్‌ ధరలు తగ్గింపు దిశగా ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నామన్న సీఎం, రాజధానికి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ నీరు, విద్యుత్‌, ఫైబర్‌ నెట్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్‌ కాకుండా ఏసీ కూడా పైప్‌లైన్ల ద్వారా తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో రావాలని కోరుతున్నానన్నారు. ఉపాధి కల్పించిన 2 వేల మందిలో 50 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మీ తోడ్పాటు ఉందన్న సీఎం, 2029 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. విజన్‌ 2047 ప్రణాళికతో ముందుకువెళ్తున్నామని, 2047 నాటికి ఒకటి లేదా రెండు స్థానాల్లో భారత్‌ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని, పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. సంపద సృష్టి, సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుందన్నారు. ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో పీపీపీ విధానంలో హైటెక్‌ సిటీ చేపట్టానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ప్రజల నివాసాలకు అనుకూల ప్రాంతంగా ఉందని, శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయన్నారు. సెజ్‌, డొమెస్టిక్‌ జోన్‌, ఫ్రీట్రేడ్‌ జోన్‌ ఇక్కడ ఏర్పాటయ్యాయని, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్టరింగ్‌ క్లస్టర్లు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. పారిశ్రామిక వాడల ఆస్తిపన్ను తగ్గించే అంశంపై సమీక్షించి నిర్ణయం తీసుకొంటామన్నారు. పరిశ్రమలకు అగ్నిమాపక శాఖ అనుమతుల మంజూరు, పునరుద్ధరణపై కొత్త విధానం అమలు చేస్తామన్నారు. అనుమతులకు దరఖాస్తు చేసుకొన్న నెల రోజుల్లో ఆమోదం తెలిపేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. అగ్రిమాపక శాఖ అనుమతుల రెన్యువల్‌ను ఐదేళ్లకోసారి చేసుకొనేలా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి టి.జి. భరత్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం ఒక్కసారి కూడా శ్రీసిటీని సందర్శించ లేదన్నారు. సీబీఎన్‌ అంటేనే అభివృద్ధి బ్రాండ్‌ అన్నారు. వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు విజన్‌కు తగ్గట్టుగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.జపనీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీసాడోసన్‌ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు అభినందనలు తెలిపారు.శ్రీసిటీలో పరిశ్రమల స్థాపనకు మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉందని, ఇప్పటికే అనేక జపనీస్‌ కంపెనీలు శ్రీసిటీలో నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. కంపెనీలకు మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రావడం సంతోషకరం అన్నారు. అనంతరం టొరే ప్రతినిధి శ్రీ అజయ్‌,ఇసుజు ప్రతినిధి శ్రీ మిట్టల్‌ ,డైకిన్‌ ప్రతినిధి శ్రీ నిమ్మగడ్డ కుటుంబరావు తదితర పారిశ్రామిక ప్రతినిధులు ప్రసంగించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజినెస్‌ సెంటర్‌కు చేరుకుని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పరిశ్రమలకు చెందిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, విజయశ్రీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌, ఎస్పీ ఎల్‌. సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌, శ్రీసిటీ యాజమాన్యం, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img