Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వైద్య సేవలకు అంతరాయం

. దేశవ్యాప్తంగా వైద్యుల నిరవధిక సమ్మె
. కోల్‌కతా ఘటనకు నిరసనగా ఉధృత ఆందోళన

కోల్‌కతా/న్యూదిల్లీ: కోల్‌కతాకు చెందిన ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి వద్ద ఒక జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా దేశంలోని అనేక ప్రాంతాల్లో వైద్యులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని, వైద్య సిబ్బంది అందరికీ భద్రత కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్లు, ఇంటర్న్‌లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రయినీలు మహిళా వైద్యురాలి మృతిపై మెజిస్టీరియల్‌ విచారణ కోరుతూ సమ్మెను కొనసాగించ డంతో వరుసగా నాలుగో రోజు ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ‘మా సహోద్యోగి హత్యపై సీబీఐ లేదా సిట్టింగ్‌ మేజిస్ట్రేట్‌ ద్వారా నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుత పోలీసుల విచారణపై అసంతృప్తితో ఉన్నాం. న్యాయం జరిగే వరకు మా నిరసన కొనసాగుతుంది’ అని నిరసనకారులు స్పష్టం చేశారు. ఇక దేశ రాజధాని దిల్లీలోని మౌలానా ఆజాద్‌ వైద్య కళాశాల, ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి, లేడీ హార్దింగ్‌ వైద్య కళాశాల, వీఎంఎంసీ`సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రి, జీటీబీ, ఐహెచ్‌బీఏఎస్‌, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ వైద్య కళాశాల ఆస్పత్రి, జాతీయ టీబీ, శ్వాసకోశ వ్యాధుల ఆస్పత్రితో సహా 10 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమ్మె ప్రారంభమైంది. గురువారం రాత్రి కోల్‌కతాలోని ప్రభుత్వాస్పత్రి సెమినార్‌ హాల్‌లో 32 ఏళ్ల ట్రయినీ వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక శవపరీక్ష నివేదిక ప్రకారం, బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేట్‌ భాగాల నుంచి రక్తం కారుతోంది. అలాగే ఆమె ఎడమ కాలు, మెడ, కుడి చేయి, ఉంగరపు వేలు, పెదవులపై గాయాలు కూడా ఉన్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బెంగాల్‌లో సమ్మె ప్రారంభమైనట్లు భారత రెసిడెంట్‌ వైద్యుల సంఘం సమాఖ్య తెలిపింది. సోమవారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సేవలను నిలిపివేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌ వైద్యుల ఫోరం నిష్పాక్షిక విచారణ కమిటీని ఏర్పాటు చేసి దోషులకు ఉరిశిక్ష విధించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేసింది. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ మూడు రోజుల్లో రెండోసారి ఆదివారం ఆస్పత్రిని సందర్శించి నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. విచారణ పారదర్శకంగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల ఆస్పత్రితో సంబంధం లేని పౌర వలంటీర్‌ను అరెస్టు చేశారు.
సమ్మెలో చేరిన దిల్లీ ఎయిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యులు
దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్‌) రెసిడెంట్‌ వైద్యుల సంఘం (ఆర్‌డీఏ) సోమవారం ఉదయం దేశవ్యాప్త సమ్మెలో చేరింది. రోగుల వార్డులు, ఓపీడీ సహా ఎంపిక చేసిన సేవలను నిలిపివేసింది. అయినప్పటికీ, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు ఇబ్బంది పడకుండా వారికి అత్యవసర సంరక్షణ కొనసాగుతుందని ఎయిమ్స్‌ ఆర్‌డీఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రఘునందన్‌ దీక్షిత్‌ తెలిపారు. అనేక ప్రభుత్వ ఆస్ప త్రులు ఆదివారం సమ్మెను ప్రకటించగా, దిల్లీలోని ఎయిమ్స్‌ సోమవారం ఉదయం 11.30 గంటలకు సమ్మె ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ సమగ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రెసిడెంట్‌ వైద్యులు ఈ కేసుపై పారదర్శకంగా దర్యాప్తు చేయాలని, వెంటనే సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. ‘బాధితురాలి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలి. ప్రాణాలను రక్షించడానికి ఉద్దేశించిన ప్రదేశంలో ఈ దారుణం జరగడం, సేవ చేసే వారు ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పును గుర్తు చేస్తుంది. మీడియా, పౌర సమాజ సంస్థలు, ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనకు మద్దతుగా నిలబడాలని కోరుతున్నాం’ అని డాక్టర్‌ దీక్షిత్‌ అన్నారు. కర్నాటకలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర చాప్టర్‌కు చెందిన వైద్యులు దారుణమైన అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిరచారు. నిమ్హాన్స్‌లోని రెసిడెంట్‌ వైద్యులు ఈ సంఘటనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక నిరసన చేపట్టారు. బాధితురాలికి సంఫీుభావంగా వైద్యులందరూ నల్ల బ్యాడ్జీని ధరించాలని కోరుతూ పోస్టర్లు, వారి ఆస్పత్రుల్లో సందేశాన్ని ప్రదర్శించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img