Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సహాయ చర్యలు ముమ్మరం

. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నిత్యవసరాలు
. అమరావతి మునిగిపోతుందంటూ దుష్ప్రచారం
. విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు. బాధితులకు ఎలాంటి అవసరం వచ్చినా…తాము అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. విజయవాడలోని ఎన్టీఆర్‌జిల్లా కలెక్టరేట్‌ దగ్గర బుధవారం సీఎం విలేకరులతో మాట్లాడారు. వరద ముంపు ప్రాంతాల్లో బురద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయని, 62 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. 2,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఏర్పాటు చేసినట్లు, 100కుపైగా ఫైరింజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వివరించారు. ప్రొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా వేస్టేజ్‌ను తరలిస్తున్నామని, సహాయక చర్యల్లో 32 మంది ఐఏఎస్‌లు పనిచేస్తున్నారని, 179 మంది సచివాలయాలకు 179 మంది
సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జులుగా పెట్టామని తెలిపారు. ఎవరైనా చనిపోతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని, మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. ఇప్పటివరకు బాధితులకు 6లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామని, 8.50 లక్షల వాటర్‌ బాటిళ్లు, 3లక్షల లీటర్ల పాలు, 5లక్షల బిస్కెట్‌ ప్యాకెట్లు అందించామన్నారు. 5లక్షల మందికి భోజన ఏర్పాటు చేశామని, గర్భిణీలకు ప్రత్యేక వైద్యం అందించామన్నారు. విజయవాడకు బుడమేరు ప్రధాన సమస్యగా మారిందని, చిన్న చిన్న వాగులు కలిసి బుడమేరు పెద్దదిగా మారిందని సీఎం చెప్పారు. అటు కృష్ణానది, ఇటు బుడమేరు కలిసి విజయవాడ నగరాన్ని ముంచెత్తాయని, బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఐదేళ్లపాటు ఏం చేశారని వైసీపీ నేతల్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. వాగులను కబ్జా చేయడమే ఈ దుస్థితికి కారణమని విమర్శించారు. చివరకు పోలవరం కాల్వలోనూ మట్టిని తవ్వేశారని, బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. బుడమేరు ప్రవాహ దారిలో కాల్వలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తామని, ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కొవాలని కోరారు. గురువారం నాటికి వరద పూర్తిగా తగ్గిపోనుందని చంద్రబాబు తెలిపారు. కేంద్రమంత్రి అమిత్‌షాతో తాను ఫోన్లో మాట్లాడాననీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరినట్లు సీఎం చెప్పారు. విజయవాడ, అమరావతి ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
బోట్లకు డబ్బులు అడిగితే కేసుల నమోదు: సీఎం హెచ్చరిక
వరద బాధితులను బోట్లలో తీసుకెళ్లడం కోసం డబ్బులు అడిగితే అరెస్టుచేసి కేసులు పెడతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రైవేట్‌ బోట్ల వాళ్లు కూడా డబ్బులు వసూలు చేయొద్దని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. కూరగాయల ధరలు ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, నిత్యావసర వస్తువుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు. వివిధ ఉద్యోగ సంఘాలు ఒక్కరోజు వేతనం ఇచ్చేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. అమరావతి మునిగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని సీఎం ఖండిరచారు. అబద్ధపు ప్రచారం చేసేవారిని సంఘ బహిష్కరణ చేయాలని, వైసీపీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నారు. సాయంచేయకపోగా నిందలేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం తాను యజ్ఞం చేస్తుంటే, వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా విమర్శలను విడనాడాలని చంద్రబాబు సూచించారు.
ప్రతి ఇంటికీ సాయం అందించాలి: అధికారులకు దిశానిర్దేశం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సహాయం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని, ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. వరద తగ్గినందును ఆహారం ఇంటింటికీ వెళ్లే అవకాశముందని, ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటర్‌ పామాయిల్‌, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంప, కిలో చక్కెర అందించాలని ఆదేశించారు. మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్‌ మార్కెటింగ్‌ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని, నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరదామని చెప్పారు. ఆహారం, నీరు, బిస్కెట్లు, పాలు, అరటిపండ్లు అన్నీ ఇంటింటా అందించాలని, అన్ని అంబులెన్సులు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలని, విద్యుత్‌ పునరుద్ధరణ వేగవంతం చేయాలని, పారిశుద్ధ్య పనులు ఒక యుద్దంలా జరగాలన్నారు. ప్రతి ఇంటిని క్లీన్‌ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాలని కోరారు. వైరల్‌ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశముందని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని కోరారు. ప్రతి సచివాలయంలో ఒక వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img