Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

సామూహిక అత్యాచారం కాదు

కోల్‌కతా వైద్యురాలి కేసుపై సీబీఐ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. నిందితుడు సంజయ్‌రాయ్‌ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారించినట్లు పేర్కొన్నాయి. దర్యాప్తు తుదిదశకు చేరుకుందని, త్వరలో కోర్టులో అభియోగాలు దాఖలు చేయనుందని తెలిపాయి. తొలుత ఈ కేసును బెంగాల్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తం కావడంతో కోల్‌కతా హైకోర్టు ఆ కేసును సీబీఐకి బదిలీ చేసింది. కాగా, ఆర్జీ కర్‌ ఆసుపత్రిలోని సెమినార్‌ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ… హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకొని పరిశీలించగా… అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. సంజయ్‌ రాయ్‌ను సీబీఐ విచారించిన సందర్భంగా అతడి ప్రవర్తన గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘సంజయ్‌ రాయ్‌లో పశ్చాత్తాపం లేదు. ప్రతి నిమిషం చోటుచేసుకున్న విషయాలను గుక్కతిప్పకుండా మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడు. దాన్నిబట్టి చూస్తే అతనికి ఎటువంటి పశ్చాత్తాపం లేనట్లు కనిపించింది. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలున్నాయి. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో రాయ్‌ కనిపించాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగులోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది’’ అని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సీబీఐ అధికారి గతంలో వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img