కేంద్ర ప్రభుత్వ నిబంధనలను నోటిఫై చేసిన తర్వాత అర్హతగలవారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. సీఏఏ ప్రకారం నిబంధనలను రూపొందించడానికి గడువును 2022 జనవరి 9 వరకు పెంచాలని లోక్‌సభ, రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలను కోరినట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను మరోసారి సవరించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ అబ్దుల్ వహబ్ లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది.