Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 11, 2024
Wednesday, September 11, 2024

సూపర్‌`6కు నిధులేవి?

. రూ.1,29,972 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
. అన్నా క్యాంటీన్లు, ఇతర అవసరాలకే కేటాయింపులు
. తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా సంక్షేమ పథకాలపై మౌనం
. లబ్ధిదారుల ఎదురు చూపు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కూటమి ప్రభుత్వానికి ఆరంభంలోనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశాల ఊసులేదు. రాబోయే నవంబరు 31వరకు కూటమి ప్రభుత్వం రూ.1,29,972 కోట్లకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తొలి ఓటాన్‌ అకౌంట్‌కు సంబంధించి రూ.1,07,545 కోట్లకు ఆమోదం తెలపగా… దానికి ఈ నాలుగు నెలలకుగాను రూ.22,427 కోట్లను కలిపి మొత్తంగా రూ.1,29,972 కోట్లకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం నవంబరు వరకు వెరసి దాదాపు ఆరు నెలలపాటు మేనిఫెస్టోలోని నెలవారీ సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారింది. నవంబరు తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి…ఏవేవీ అమలు చేయాలనే దానిపై ప్రణాళికా బద్ధంగా వెళ్లే ఆలోచనలు కన్పిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీలోను, బయట బహిరంగ సభల్లోను సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తోందని వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. హామీలైతే భారీగా ఇచ్చాంగానీ అమలు చేయడమే భారంగా ఉందని… ఆర్థిక పరిస్థితులు బాగోలేదని, ప్రజలు సహకరించాలన్న చంద్రబాబు వ్యాఖ్యలతో మేనిఫెస్టో అమలు ప్రశ్నార్థకంగా మారింది. కాగా సీఎం వ్యాఖ్యలను వైసీపీతోపాటు విపక్ష పార్టీలు తప్పుబట్టాయి. ఎన్నికల మేనిఫెస్టో రూపొందించే నాటికి అనుభవం గల సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలియవా? అని ప్రశ్నిస్తున్నాయి. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిందేనని నిలదీస్తున్నాయి. అటు విద్యా సంబంధిత హామీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్‌ శాసన మండలిలో వ్యాఖ్యానించారు. దీని ప్రకారం ఈ విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం లేనట్లేననే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మేనిఫెస్టోలో వాగ్దానం మేరకు రూ.3వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచి… ఈ రెండు నెలల వరకు కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ఒకటో తేదీన అందరికీ పడపోయినప్పటికీ, కొంచెం అటూ, ఇటూగా అందరి ఖాతాల్లో వేసి వారి మన్ననలు పొందింది. అయితే ఈ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఒక్క అన్నా క్యాంటీన్లు, ఇతరత్రా అవసరాలకు మినహా, మిగిలిన సంక్షేమ అంశాల ప్రస్తావనే లేదు. కూటమి ప్రకటించిన సూపర్‌`6లోని అత్యవసర పథకాలకూ నిధులు కేటాయించలేదు.
నెలవారీ సంక్షేమం కోసం లబ్ధిదారుల ఎదురు చూపు
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు మేనిఫెస్టోలో భారీ హామీలిచ్చి, ఆ దిశగా ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చాయి. అనంతరం మేనిఫెస్టోలోని అంశాలపై కార్యాచరణ మొక్కుబడిగా కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కనీసం మూడు లేదా ఆరు నెలలపాటు సమయం అవసరమే. అయితే నెలవారీగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను వాయిదా వేసుకుంటూ పోతే..అవి ప్రభుత్వానికి మరింత భారం కానున్నాయి. సూపర్‌ 6లో భాగంగా యువతకు 20లక్షల ఉద్యోగాలు/నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి హామీకి యువత ఆకర్షితులయ్యారు. ఈరెండు నెలల్లో ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వనందున అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.3వేల చొప్పున రెండు నెలలకుగాను రూ.6వేలు పెండిరగ్‌ అవుతుందని నిరుద్యోగులు చెబుతున్నారు. 19 ఏళ్ల నుంచి 59సంవత్సరాల వరకు ప్రతి మహిళకూ నెలకు రూ.1500 సొమ్ము ఇస్తామన్నారు. ఆ లెక్కన రెండు నెలలకుగాను ప్రతి ఒక్కరికీ రూ.3వేలు సొమ్ము ప్రభుత్వం బకాయి పడిరదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. రాజీనామా చేసిన వలంటీర్లు మినహా…ఇంకా లక్షా 50వేల మంది విధుల్లో ఉన్నారు. వారికి కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో మాదిరిగా రూ.5వేలు మాత్రమే వేతనం వేస్తున్నారు. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామన్న హామీ అమలు చేయాల్సి ఉంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ పెన్షన్ల హామీలు
బీసీ డిక్లరేషన్‌లో భాగంగా 50 సంవత్సరాలకే నెలకు రూ.4వేల పెన్షన్‌ ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ లెక్కన ఈ రెండు నెలల్లో అర్హులైన లబ్ధిదారులకు రూ.8వేలు బకాయి ఉంది. ఎస్సీ,ఎస్టీలకు 50ఏళ్లకే పెన్షన్‌ విధానం అమలు అని వాగ్దానం చేశారు. ముస్లిం మైనార్టీలకూ 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని మేనిఫెస్టోలో స్పష్టంచేశారు. ఆ మేరకు ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు రెండు నెలల పెన్షన్‌ బకాయిలు రావాల్సి ఉంది. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలు సూపర్‌6లో ఉండగా… అవి ఇంకా పట్టాలెక్కలేదు. ఏడాదికి ఇచ్చే పథకాల హామీని చూస్తే…పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి(ఇంట్లో పిల్లలు ఎందరున్నా…అందరూ పాఠశాలకు వెళ్తే) ఏడాదికి రూ.15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. పాఠశాలలు పున:ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపైనా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రతి రైతుకు ఏటా రూ.20వేల ఆర్థిక సాయం ఇవ్వలేదు.
పంటలు ప్రారంభమైనప్పటికీ, రైతుకు ఇది దరిచేరలేదు. ఈ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఇలాంటి కీలక హామీల ప్రస్తావన లేదు.పూర్తి స్థాయి బడ్జెట్‌ ఆధారంగానే వాటి అమలుపై ఒక స్పష్టత వస్తుది. దీంతో కూటమి ఎప్పుడెప్పుడు తమకు ఇచ్చిన సంక్షేమ వాగ్దానాలు అమలు చేస్తుందాని లబ్ధిదారులు వేచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img