హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హాజరయ్యారు. బండారు దత్తాత్రేయ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991, 98, 99,2014లలో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రెండుసార్లు కేంద్రమంత్రిగా సేవలందించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది.