Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

హాకీ జట్టు అదరహో

భారత్‌ ఖాతాలో మరో కాంస్యం

న్యూదిల్లీ : పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీ జట్టు కాంస్య పతకం అందించింది. కాంస్య పతకం కోసం సాగిన పోరులో భారత హాకీ జట్టు స్పెయిన్‌పై 2-1 గోల్స్‌ తేడాతో గెలుపొందడం ద్వారా పతకాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. దీంతో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు షూటింగ్‌లో 3 కాంస్య పతకాలు రాగా… తాజాగా హాకీ జట్టు మరో పతకం సాధించింది. సెమీఫైనల్స్‌లో తుది వరకు పోరాడి 2-3 తేడాతో జర్మనీపై ఓడిపోయిన భారత్‌ గురువారం కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌పై విజయం సాధించింది. రెండో సెట్‌ ప్రారంభంలో మొదటి గోల్‌ సాధించి స్పెయిన్‌1-0 అధిక్యంలోకి వెళ్లింది. రెండో సెట్‌ ఆఖరి నిమిషంలో భారత్‌ మొదటి గోల్‌ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేసింది. ఇక మూడో సెట్‌ ప్రారంభంలో ఆట 33వ నిమిషంలో మరో గోల్‌ చేయడంతో భారత్‌ 2-0 అధిక్యంలోకి వెళ్లింది. సింగ్‌ హరమన్‌ప్రీత్‌ భారత్‌ తరపున రెండు గోల్స్‌ చేశారు. మూడో సెట్‌ ముగిసే సమయానికి భారత్‌ 2-1 అధిక్యంలో నిలిచింది. నాల్గవ సెట్‌లో ఎవరికి పాయింట్‌ రాకపోవడంతో భారత్‌ 2-1తో విజయం సాధించి కాంస్య పతకం అందుకుంది.
హాకీలో 13వ పతకం…
ఇప్పటివరకు భారత్‌ హాకీలో 13 పతకాలు సాధించింది. ఇందులో స్వాతంత్య్రానికి ముందు 3 పతకాలు గెలవగా.. ఆ తర్వాత 10 పతకాలను గెలుచుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న భారత జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది. 1928లో బంగారు పతకం గెలుచుకున్న భారత్‌… ఆ తర్వాత 1932, 1936 ఒలింపిక్స్‌లో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించింది. స్వాతంత్య్రం తర్వాత 1948 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ఆ తర్వాత 1952, 1956 విశ్వ క్రీడల్లో బంగారు పతకం సాధించింది. స్వాతంత్య్రం తర్వాత వరుసగా మూడు స్వర్ణపతకాలను సాధించింది. మళ్లీ 1960లో రజత పతకం సాధించగా.. 1964లో బంగారు పతకం సాధించింది. 1968, 1972 ఒలింపిక్స్‌లో భారత హకీజట్టు కాంస్య పతకం సాధించింది. 1980 విశ్వక్రీడల్లో మరోసారి స్వర్ణ పతకం సాధించింది. 1980 నుంచి 2020 వరకు భారత హాకీ జట్టు పతకాన్ని సాధించలేదు. చివరిగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలవగా.. తాజాగా పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img