Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

హాస్టళ్లలో మౌలిక వసతుల కోసం ఉద్యమించిన విద్యార్థిలోకం

నినాదాలతో మార్మోగిన కలెక్టరేట్లు

విశాలాంధ్ర`విజయవాడ/ అనంతపురం/గుంటూరు: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) అధ్వర్యాన విద్యార్థులు ఉద్యమించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల వసతి గృహలోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేం దుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిం చాలని, పెండిరగ్‌ లో ఉన్న మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ ఛార్జీలు విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంతోపాటు జీవో నెంబర్‌ 77ను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో మంగళవారం వివిధ జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంత పురంలో దాదాపు ఐదువేల మంది విద్యార్థులతో కలెక్టరేట్‌ దగ్గర మహాధర్నా నిర్వహించారు. సమస్యలపై విద్యార్థుల నినాదాలతో కలెక్టరు కార్యాలయ ప్రాంతం మారుమోగింది. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద వందలాది మందితో ధర్నా జరిగింది. విజయవాడలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి మాట్లాడుతూ హాస్టల్‌ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కనీసం విద్యార్థులకు మరుగుదొడ్లుగాని స్నానపు గదులుగాని లేని పరిస్థితి నెలకొందన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి ఎం. సాయికుమార్‌ మాట్లాడుతూ, అద్దె భవనాలలో నడుస్తున్న హాస్టళ్లకు తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ విజయవాడ నగర అధ్యక్ష, కార్యదర్శులు రంజిత్‌, జగదీశ్‌, నాయకులు సుధీర్‌, అయ్యప్ప, సురేశ్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో: రాష్ట్ర వ్యాప్తంగా పెండిరగ్‌లో ఉన్న మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వి.జాన్సన్‌ బాబు డిమాండ్‌ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాన్సన్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గత ఏడు సంవత్సరాల నుంచి ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. నెల రోజుల్లో సమస్యలను పరిష్కరించకుంటే చలో సచివాలయానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాశం వెంకటేష్‌, బందెల నాసర్‌ జీ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని కోడిగుడ్ల సత్రంలో సమీకృత సంక్షేమ హాస్టల్‌ భవనానికి కోటి రూపాయలు కేటాయించి తక్షణమే పూర్తి చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు యశ్వంత్‌, శివ నాగరాజు, అభి, నవ్యశ్రీ, కిరణ్‌, డేవిడ్‌, అమర్నాథ్‌, అజయ్‌, వెంకటేశ్‌, బన్నీ, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలో భారీ ధర్నా: అనంతపురంలో జరిగిన మహాధర్నాను ద్దేశించి ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుల్లాయిస్వామి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ లో విద్యకు నిధులు పెంచాలన్నారు. ప్రభుత్వం హాస్టల్లో చదువు కుంటున్నా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అనేక సమస్యలపై ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పెడుతున్నాయ న్నారు. అందుకే నేడు వేలాది మంది విద్యార్థులు కలెక్టరు కార్యాలయ ముందు మహాధర్నాకు పూనుకున్నారన్నారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదని విద్యార్థుల సత్తా ఏమిటో ప్రభుత్వాలకు తెలిసే విధంగా పోరాటాలు వుంటాయన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రమణయ్య, కోశాధికారి హనుమంతు, ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్‌ వంశీ, సహాయ కార్యదర్శులు వెంకట్‌ నాయక్‌, ఆంజనేయులు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంజునాథ్‌, చిరుతల ఉమామహేష్‌ తదితరులు నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img