Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

హిజాబ్‌ వివాదంపై ఇతర దేశాల కామెంట్లు..కౌంటర్‌ ఇచ్చిన భారత్‌

కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్‌’ వివాదం దేశవ్యాప్తంగానే గాక అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇటీవల కొందరు విదేశీ ప్రముఖులతోపాటు కొన్ని దేశాలు కూడా దీనిపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేశాయి. దీంతో ఈ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ అంతర్గత విషయాలపై రెచ్చగొట్టే కామెంట్లు చేయడం తగదని సూచించింది. అటు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడమ్‌ కూడా ఈ వివాదంపై స్పందించింది. దీని అంబాసిడర్‌ రాషద్‌ హుస్సేన్‌ ఆ అంశంపై ఓ ట్వీట్‌ చేశారు. స్కూళ్లలో హిజబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను హరించడమే అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లోనే ఐఆర్‌ఎఫ్‌ అంబాసిడర్‌గా రాషద్‌ను అమెరికా నియమించింది. అయితే రాషద్‌ చేసిన కామెంట్‌కు ఇండియా రియాక్ట్‌ అయ్యింది. వక్రబుద్ధితో చేసిన వ్యాఖ్యలను స్వాగతించడం లేదని ఇవాళ విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొన్నది.ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ఓ ట్వీట్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిరచారు. దేశ అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల అభిప్రాయాలను పట్టించుకోమన్నారు. డ్రెస్‌ కోడ్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ‘కర్ణాటకలోని కొన్ని విద్యాసంస్థల్లో డ్రెస్‌కోడ్‌ అంశాన్ని ప్రస్తుతం కర్ణాటక ఉన్నత న్యాయస్థానం పరిశీలిస్తోంది. మా రాజ్యాంగ విధి విధానాలు, ప్రజాస్వామ్య నియమాలకు అనుగుణంగా ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత్‌ గురించి పూర్తిగా తెల్సిన వారు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటారు. అయితే మా అంతర్గత సమస్యలపై ప్రేరేపించే వ్యాఖ్యలను ఎన్నటికీ స్వాగతించబోం.’ అని అరిందం తన ట్వీట్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img