కాకినాడ జిల్లాలో 86 గ్రామాలను చుట్టుముట్టిన వరద
. వేలాది ఎకరాల్లో పంట నీట మునక
. ప్రత్తిపాడు`సామర్లకోట మధ్య నిలిచిన రాకపోకలు
ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీగా వరద కొనసాగుతోంది. ఏడు గేట్లు ఎత్తేసి ఏలేరు జలాశయం నుంచి సుమారు 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 46వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో జిల్లాలోని పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాల్లోని 10 మండలాల పరిధిలోని 86 గ్రామాలపై పడిరది.
ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీగా వరద కొనసాగుతోంది. ఏడు గేట్లు ఎత్తేసి ఏలేరు జలాశయం నుంచి సుమారు 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 46వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో జిల్లాలోని పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాల్లోని 10 మండలాల పరిధిలోని 86 గ్రామాలపై పడిరది. ఇప్పటికే ఆయా గ్రామాలు, కాలనీలను వరద చుట్టుముట్టింది. ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. కిర్లంపూడి మండలం రాజుపాలెం, ఎస్ తిమ్మాపురం, గోపాలపట్నం, సుందరాయనపాలెం గ్రామాలు ఏలేరు వరద ముంపులో ఉన్నాయి. ఎస్ తిమ్మాపురం, రాజుపాలెం గ్రామాల వద్ద ఏలేరు కాల్వకు గండి పడడటంతో భారీగా వరద గ్రామాలను ముంచెత్తింది. దీంతో ఇళ్లు, పంట పొలాల్లోకి వరద చేరింది. దీంతో గ్రామాల నుంచి బయటకు వచ్చే మార్గంలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం, నీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై పర్యటించి బాధితులతో మాట్లాడారు. రాజుపాలెంలో 2.కి.మీ మేర రహదారిపై వరద ప్రవహిస్తోంది. ప్రత్తిపాడు-సామర్లకోట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గోపాలపట్నం, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అధికారులు 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 500 మందిని అక్కడికి తరలించారు. మరోవైపు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు దిగనున్నాయి. ఏలేరు వరద ప్రభావిత గ్రామాల్లో స్కూళ్లకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. వరద నీటి ఉధృతికి పిఠాపురం నియోజవర్గంలో ఐదు చోట్ల కాలువలు గండ్లు పడి గ్రామాలను సైతం ముంచెత్తాయి. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు ప్రవహించడంతో వాహనాలు దారి మళ్లించారు. పత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలం పూర్తిగా వరద ముంపుకు గురైంది. కాగా సమీప జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి, కిర్లంపూడి, జగ్గంపేట మండలాలను సైతం వరద ముంచేతత్వంతో కిర్లంపూడి మండలంలో రాజుపాలెం వద్ద కాలువకు గండి పడి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఏలేశ్వరంలో అప్పన్నపాలెం బ్రిడ్జి మునిగిపోవడంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దాపురంలో వరదలకు లో బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది. సోమవారం రాత్రి వరకు వరద ఉధృతి కొనసాగినప్పటికీ మంగళవారం నిలకడగా కొనసాగుతోంది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో పర్యటించి బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు.
అన్ని రకాల అండగా ఉంటామని హామీ ఇచ్చి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. మంగళవారం పత్తిపాడు శాసనసభ్యురాలు సత్యప్రభ, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తమ తమ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. కాగా వరద ఉధృతి తగ్గిన అనంతరం పంట నష్టం అంచనా వేయడం జరుగుతుందని అధికారులు వెల్లడిరచారు. ప్రభుత్వం సకాలంలో పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.