ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను సోమవారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రారంభించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయనతో ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన వారణాసికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ..కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ మైలురాయిని దాటినందుకు భారత దేశాన్ని మోదీ అభినందించారు. ‘అందరికీ టీకా, ఉచిత టీకా’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. దీపావళి, ఛాత్ తదితర పండుగలను దేశమంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు
ఉత్తరప్రదేశ్‌కి కొత్తగా 9 వైద్య కళాశాలలు
ప్రధాని మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌కు 9 వైద్య కళాశాలకు భూమి పూజ చేశారు. సిద్ధార్ధ్‌నగర్, ఈటా, హర్దోయ్, ప్రతాప్‌ఘఢ్, ఫతేపూర్, దియోరియా, ఘజీపూర్, మీర్జాపూర్, జాన్పూర్ జిల్లాల్లో 9 మెడికల్ కాలేజీలను ఈ సందర్భంగా ప్రారంభించారు. 9 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో దాదాపు రెండున్నర వేల కొత్త బెడ్‌లు సిద్ధం చేసినట్లు మోదీ చెప్పారు. 5 వేల మందికి పైగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ఇక్కడ కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. దీనితో పాటు, ప్రతి సంవత్సరం వందలాది మంది యువతకు వైద్య విద్య యొక్క కొత్త మార్గం తెరుచుకుంటుందని మోడీ అన్నారు.