సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్
ఇంటెలిజెన్స్ ఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలోని 16 మంది ఐపీఎస్‌లకు బదిలీలు, నియామకాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీజేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీజేశారు. ఇందులో కొందరు ఐపీఎస్‌లకు రాష్ట్ర, జిల్లాస్థాయి కీలక బాధ్యతలు అప్పగించింది. మరో ఇద్దరు ఐపీఎస్‌లను డీజీపీ ప్రధాన కార్యాలయానికి అటాచ్‌మెంట్ చేశారు. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజిలాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. పీఅండ్‌ఎల్ ఐజీగా రవి ప్రకాశ్, ఇంటెలిజెన్స్ ఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ, ఎస్పీగా ఫకీరప్ప, డీజీపీ కార్యాలయ డీఐజీ అడ్మిన్‌గా అమ్మిరెడ్డి, రోడ్డు భద్రతా డీఐజీగా సీహెచ్ విజయరావును నియమించారు. శాంతిభద్రతల ఏఐజీగా సిద్దార్థ కౌశల్, విశాఖ సిటీ డీసీపీగా మేరీ ప్రశాంతి, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, ఏపీపీఎస్సీ
3 కాకినాడ మూడవ బెటాలియన్ కమాండెంట్‌గా ఎం.దీపిక, ఒంగోలు పీటీసీ ప్రిన్సిపల్‌గా జీఆర్ రాధిక, ఇంటెలిజెన్స్ సెక్యురిటీ ఎస్పీగా ఆరీఫ్ హఫీజ్, పీటీవో ఎస్పీగా కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, ఎన్టీఆర్ కమిషనరేట్‌లో విజయవాడ క్రైమ్ డీసీపీగా తిరుమలేశ్వర్‌రెడ్డిని నియమించారు. బాపూజీ అట్టాడ, కేవీ శ్రీనివాసరావును డీజీపీ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపటినప్పటి నుంచి వరుసవారీగా ఐపీఎస్, ఐఏఎస్‌ల మార్పులపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కొందరు ఐపీఎస్‌లను, ఐఏఎస్‌లను బదిలీ చేసింది. గత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారన్న ఆరోపణలపై కొందరు ఐపీఎస్‌లకు ఇంతవరకు బాధ్యతలు ఇవ్వలేదు. వారిని ప్రతిరోజూ డీజీపీ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాలని ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ముంబై సినీనటి జెత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరికొంత మంది ఐపీఎస్‌లు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఇంతవరకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా చంద్రబాబు ప్రభుత్వం ప్రక్షాళన చేస్తూ… రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమర్థత గల ఐపీఎస్‌లకు కీలక పోస్టులు కేటాయించింది.