రాజ్యాంగంలో కొత్త అధ్యాయానికి లా కమిషన్ సిఫార్సు
న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలి ఎన్నికల కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. లా కమిషన్ కూడా జమిలి ఎన్నికలు జరిపించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని సిఫార్సు చేయనున్నది. 2029లో 19వ లోక్‌సభకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఇదే క్రమంలో పార్లమెంటు, శాసన సభలు, స్థానిక సంఘాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించే బృహత్ కార్యాన్ని చేపట్టేందుకు వీలుగా జమిలి ఎన్నికలపై కొత్త అధ్యాయాన్ని రాజ్యాంగంలో చేర్చాలని లా కమిషన్ సిఫార్సు చేయబోతోంది. ఈమేరకు అధికార వర్గాలు బుధవారం వెల్లడిరచాయి. 2029 మే`జూన్‌లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు లా కమిషన్ సిఫార్సులు చేయనున్నట్లు పేర్కొన్నాయి. జమిలి ఎన్నికలపై కొత్త అధ్యాయం లేక భాగాన్ని రాజ్యాంగంలో చేర్చాలని రిటైర్డ్ జడ్జి రితు రాజ్ అవస్థీ నేతృత్వ లా కమిషన్ సిఫార్సు చేయనున్నట్లు వెల్లడిరచాయి. వచ్చే ఐదేళ్లలో శాసనసభల పదవీ కాలాల సర్దుబాటు ప్రక్రియ మూడు దశల్లో జరిగే విధంగా లా ప్యానల్ సిఫార్సు చేయబోతోంది. దీంతో 2029 మేజూన్‌లో తొలి జమిలి ఎన్నికలు జరిగే వీలుంటుంది. రాజ్యాంగంలో చేర్చాలనే అధ్యాయంలో జమిలి ఎన్నికలు, జమిలి ఎన్నికల సుస్థిరత, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఉమ్మడి ఓటర్ల జాబితా వంటి అంశాలు పొందుపర్చడం ద్వారా మూడంచెల జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయని అధికార వర్గాలు వివరించాయి. శాసనసభల పదవీ కాలానికి సంబంధించిన రాజ్యాంగంలోని నిబంధనలను భర్తీ చేసేలా నూతన అధ్యాయం ఉండేలా సిఫార్సులు ఉండనున్నట్లు తెలిపాయి. ‘శాసనసభల పదవీ కాలాలు సమకాలీనంగా ఉండే ప్రక్రియ మూడు దశల్లో వచ్చే ఐదేళ్లలో జరుగుతుంది. మూడు నుంచి ఆరు నెలల్లోగా పదవీ కాలం ముగియనున్న అసెంబ్లీలపై తొలి దశలో దృష్టి పెడతారు’ అని అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ అవిశ్వాసంతో ప్రభుత్వాలు కూలిపోతే లేదా హంగ్ ఏర్పడితే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ‘ఉమ్మడి ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేయాలని ప్యానల్ సిఫార్సు చేయనుంది. ఉమ్మడి ప్రభుత్వం (యూనిటీ గవర్నమెంట్) ఫార్ములా పని చేయని పక్షంలో అసెంబ్లీకి మిగిలిన పదవీ కాలానికిగాను కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేయనున్నది. ఎన్నికల వచ్చి... ప్రభుత్వ పదవీ కాలం మూడేళ్లు మిగిలివుంటే... జరగబోయే ఎన్నికలు ఆ కాలానికి వర్తిస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. లా కమిషన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వ ఉన్నతస్థాయి కమిటీ కూడా జమిలి ఎన్నికల సాధ్యసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్
మేలో జరగబోతున్నాయి. ఐదు అసెంబ్లీలకూ ఎన్నికలు ఉంటాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. బీహార్, దిల్లీ అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి.
అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరుగుతాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్నాటక, మిజోరం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణతో కలిసి తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగనున్నాయి.