గుజరాత్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ భారీ వర్షాలకు దాదాపు 28 మంది మృతి చెందారు. ఈ మరణాలు రాజ్‌కోట్, ఆనంద్, మహిసాగర్, ఖేడా, అహ్మదాబాద్, మోర్బి, జునాగఢ్, బరూచ్ జిల్లాల నుండి సంభవించాయి. మరణించిన వారిలో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్-ట్రాలీ కొట్టుకుపోవడంతో మోర్బి జిల్లాలోని ధావానా గ్రామ సమీపంలో పొంగిపొర్లుతున్న కాజ్‌వేను దాటుతుండగా తప్పిపోయినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదిక తెలిపింది. అదే సమయంలో,40 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 17000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్‌లోని 11 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం రెడ్ అలర్ట్ మరియు 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.