19వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి
ముంంబై నగరంలోని కర్రీ రోడ్‌లో ఉన్న 61 అంతస్థులు ఉన్న ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనంలోని 19వ అంతస్థులో మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయి. సెంట్రల్ ముంబై అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, బిల్డింగ్‌లోని 19వ అంతస్థులో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు 12 అగ్నిమాపక శకటాలు కృషి చేస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లను కూడా తరలించారు. కాగా మంటలు వ్యాపించడంతో 19వ అంతస్తులో ఉండే వ్యక్తి ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్కనీలోకి పరిగెత్తాడు. అక్కడి గ్రిల్స్ పట్టుకుని కిందకు దిగాలని ప్రయత్నించి బ్యాలెన్స్ కోల్పోవడంతో క్షణాల్లో ఆ వ్యక్తి అక్కడి నుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడిరచారు.19వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి