ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. రేపు మరో 75 క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. విశాఖ నగర పరిధిలో 25 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కోడ్ ఉన్నందువల్ల ఇక్కడ క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదు. అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం రూ. 5కే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నారు.