చైనాలోని యునాన్ ఫ్రావిన్స్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర దుర్ఘటన జరిగింది. యునాన్ ప్రావిన్స్‌లోని ఈశాన్య ప్రాంతంలోని లియాంగ్‌షురు గ్రామంలో ఈరోజు ఉదయం 6 గంటల ముందు ఈ విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడి 47మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే అధికార సహకార సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వందల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషయాలను స్థానిక మీడియా కథనాల్లో తెలిపింది. ఈ ఘోర దుర్ఘటనలో చాలావరకు ఇండ్లు కుప్పకూలిపోయాయి. వాటికింద చిక్కుకుపోయినవారిని బయటకు తీయడానికి సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, కురుస్తున్న మంచు మధ్య 200 మందిని ఖాళీ చేయించారు. 18 వేర్వేరు ఇళ్లలో బాధితులను కనుగొనడానికి రెస్క్యూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తొమ్మిదేళ్లలో చైనాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాల్లోౌ దాదాపు 1,000 మంది గాయపడ్డారు.